కుప్పంలో బాబును ఓడించి జగన్‌కు కానుకగా ఇస్తాం- మంత్రి పెద్దిరెడ్డి
– బాబుకు నియోజకవర్గం లేక కుప్పంలో వెతుకులాట
– బాబు వెంట ఎవరు లేరు
– కుప్పం ప్రజలకు భరోసా ఇచ్చాం
పుంగనూరు ముచ్చట్లు:
కుప్పంలో చంద్రబాబును ఓడించి, ముఖ్యమంత్రి జగన్‌కు ఆసీటును కానుకగా ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాత్రి పులిచెర్లలో జరిగిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఎవరు అండగా లేరని, బయట ప్రాంతాలకు చెందిన లీడర్లతో రాజకీయం చేస్తున్నాడని ఎద్దెవా చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు కుప్పంను ఏం అభివృద్ధి చేశారని నిలధీశారు. వైఎస్సార్‌సిపి నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి, వేదించలేదా అంటు నిలధీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు అన్ని స్థానిక ఎన్నికల్లో కూడ వైఎస్సార్‌సిపికి పట్టం కట్టారని, తమ పార్టీ ప్రజలకు అండగా నిలిచిందని స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పోటీ చేసేందుకు ఎక్కడ నియోజకవర్గాలు లేకపోవడంతో కుప్పంలో తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చి మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దెవా చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో గెలిచిఉండాలన్నారు. అన్నింటా ఓటమి చెంది , కుప్పంలో పోటీ చేస్తానంటే తాము స్వాగతించి, చంద్రబాబును అక్కడే ఓడించి, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్, పాలఏకీరి కార్పోరేషన్ చైర్మన్ మురళి, ఎంపిపి సురేంద్రరెడ్డి , వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు విరుపాక్షి జయచంద్రారెడ్డి, రెడ్డీశ్వర్‌రెడ్డి, స్వచ్చాంద్ర కార్పోరేషన్ డైరెక్టర్ రెడ్డిప్రకాష్ పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Solar probe propelled into the Sun’s atmosphere …