వ్యవసాయ పంపుసెట్లకు సోలార్…

Solar pumps for agricultural pumpets

Solar pumps for agricultural pumpets

Date:24/11/2018
రాజమండ్రి ముచ్చట్లు:
రోజురోజుకీ పెరుగుతోన్న విద్యుత్ వాడకాన్ని తగ్గించుకునేందుకు విద్యుత్‌శాఖకు సోలార్ పవర్ ప్రత్యామ్నాయంగా మారింది. దీనివలన కాలుష్యాన్ని నియంత్రవచ్చని భావించింది. ముఖ్యంగా వేసవి సీజన్‌లో విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కోగలిగిన ఈ శాఖ వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ పంపుసెట్ల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురాగలిగింది. దీనివల్ల విద్యుత్‌ను ఆదా చేయడంతోపాటు రైతులు తమతమ క్షేత్రాల్లో అవసరమైనపుడు దీనిని వాడుకునే వీలుంటుంది. ఈ విధానం వలన విద్యుత్ ప్రమాద సంఘటనలు తలెత్తవు. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు చాలా వరకు శ్రీకాకుళం జిల్లాలో చాలావరకు సోలార్ పవర్ వాడకానికి ఇపుడిపుడే అలవాటు పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గత నెలలో ముంచుకొచ్చిన తిత్లీ తుపాను విద్యుత్ వ్యవస్థను నాశనం చేయడంతోపాటు ప్రధాన ప్రత్యామ్నాయంగా భావిస్తోన్న సోలార్ పవర్ ప్రాజెక్టు చెందిన పరికరాలు విధ్వంసానికి గురయ్యాయి. అలాగే వేసవి సీజన్‌లో డిమాండ్‌ను తట్టుకునేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు సోలార్ పవర్ చక్కటి అవకాశంగా చెప్పవచ్చు.
అన్నింటికంటే ప్రధానంగా విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఇదొక మార్గంగా మారింది. వీటన్నింటితోపాటు తరచూ ఎదురయ్యే లోవోల్టేజీ సమస్యలు, సాంకేతికపరమైన ఇబ్బందులు, లోడ్ పెరగడంతో ఎదురయ్యే మరికొన్నింటినీ సోలార్ పవర్ ద్వారా సులభంగా అధిగమించేందుకు చక్కటి అవకాశాలు ఉండేవి. అటువంటిది గత నెలలో శ్రీకాకుళం జిల్లాను కుదేపీసిన తిత్లీ తుపానుతో అక్కడి విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. దీనివల్ల ఎక్కువుగా ఆస్తిపరంగా నష్టపోయింది ఈపీడీసీఎల్, ఏపీ ట్రాన్స్‌కో, జనరేషన్ కంపెనీలే. వీటన్నింటికీ కలిపి దాదాపు రూ.500 కోట్ల మేర నష్టవాటిల్లినట్టు అధికార వర్గాలు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. దాదాపు నెల రోజులపాటు క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఏఇలు, ఏడీఇలు, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, పలు జిల్లాలకు చెందిన ఎస్‌ఇలు, జనరల్ మేనేజర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, చివరకు డైరెక్టర్లు, ఈపీడీసీఎల్ ఎండీ, అలాగే ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో ఉన్నతాధికారులు ఇక్కడ మకాం వేసి దాదాపు రెండు వేల మంది వరకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. అయితే ఈ విధంగా తిత్లీ తుపానుతో విద్యుత్ నష్టాలు భారీగా ఉండగా, మరోపక్క ప్రత్యామ్నాయంగా భావిస్తోన్న సోలార్ పవర్ ప్రాజెక్టులు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
ఏళ్ళ తరబడి విస్తృత ప్రచారం చేసి మరీ కోట్లాది రూపాయలు వెచ్చించి సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసిన విద్యుత్‌శాఖ ఇపుడు ఏమీ చేయాలతో తెలియక అయోమయంలో పడింది. వాస్తవానికి విశాఖ జిల్లాకంటే కూడా ఉష్ణోగ్రతల తీవ్రత విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువుగా ఉంటుంది. అలాగే సూర్యోదయం నుంచి అస్తమించడం వరకు ఎండ తీవ్రంగా ఉన్నందున ఈ రెండు జిల్లాల్లో సోలార్ పవర్‌ను ఉపయోగించుకునేందుకు ఈ శాఖ చేపట్టిన కార్యక్రమాలు అన్నీ,ఇన్నీకావు. నెడ్‌క్యాప్, విద్యుత్‌శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోలార్ పవర్ గురించి విస్తృత ప్రచారం జరపడంతోపాటు పలు కార్పొరేట్ సంస్థల ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్టులను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయించగలిగాయి. ఇవి అతి తక్కువ సమయంలోనే వినియోగదారుల ఆదరణ పొందగలిగాయి. వీటి వలన చక్కటి ఫలితాలు వచ్చాయి. ఇదే విధానాన్ని ఏపీలో పలు జిల్లాలకు విస్తరించడంలోను ఈశాఖ విజయం సాధించగలిగింది.దీంతో మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురావాలంటే సమయం పడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Tags:Solar pumps for agricultural pumpets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *