షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఎమ్ భాషా కు  ఘన సన్మానం

Date:22/10/2020

దర్శి ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి లో గురువారం  కురిచేడు రోడ్డు లోని పూలే భవనములో దర్శి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడిన డాక్టర్ ఎస్ ఎమ్ .భాషా   ని ఘనంగా సన్మానించారు  .విద్యావంతుడు ప్రజాసేవలో ముందు ఉండే డాక్టర్ ఎస్ఎం భాషా కి షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నుకోవడం బీసీలకు ముఖ్యమం త్రివర్యులు ఇంకా ఎంతో గుర్తింపు ఇస్తారనే నమ్మకం కలిగించారని సభాధ్యక్షులు అన్నవరపు వెంకటేశ్వర్లు కొనియాడారు. అలాగే దర్శి నియోజకవర్గం నుంచి వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన మల్లెల విమలకు ,కురిచేడు మండలం కల్లూరు గ్రామానికి చెందిన నిమ్మకాయల రాజయ్యకు యాదవ సంఘం డైరెక్టర్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి,  దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కి దర్శి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు రంగారావు, మీనిగ శ్రీను, మిల్లర్ బుజ్జి ,గోనుగుంట శ్రీను,వరకాల వెంకటేశ్వర్లు, విజ్జగిరి శ్రీను,అంకాల శ్రీను, చెరుకూరి జగన్మోహన్,ఆర్.  కాసిమ్, టైం స్కేల్ ఎంప్లాయిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు, దళిత సేన అధ్యక్షులు కే. మార్క్, కార్యదర్శి జి.ప్రేమకుమార్ మరియు బీసీ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tags: Solid tribute to Dr. SM Bhasha, Director, Sheikh Corporation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *