Solidarity rally in support of Delhi farmers

 ఢిల్లీ రైతులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ

Date:03/12/2020

తుగ్గలి ముచ్చట్లు:

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా తుగ్గలి లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు.గురువారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి లో గుంతకల్ మరియు గుత్తి ప్రధాన సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మరియు సిపిఐ నాయకులు రోడ్డు దిగ్బంధం చేసి కేంద్ర ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్న పై కేంద్ర ప్రభుత్వం దురుసుగా ప్రవర్తిస్తూఉందని,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును పూర్తిగా ఉపసంహరించు కోవాలని వారు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్నా ధర్నాకు సంఘీభావంగా మండల కేంద్రమైన తుగ్గలిలో ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్టు నాయకులు తెలియజేశారు. ప్రభుత్వాలు తీసుకువచ్చే బిల్లులు గానీ,చట్టాలు గానీ రైతులకు అనుకూలంగా ఉండాలేగానీ, రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని వారు తెలియజేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఉపసంహరించుకునేంత వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తునేఉంటామని వారు తెలియజేశారు. ప్రధాన రహదారిపై నాయకులు ధర్నాలు చేపట్టడంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ఈ కార్యక్రమంలో తుగ్గలి మండల సిపిఐ నాయకులు,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

 బీజేపీ పార్టీ ని బలోపేతం చేయాలి

Tags:Solidarity rally in support of Delhi farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *