ఇన్నోవేషన్ పాలసీ ద్వారా రైల్వే సమస్యల పరిష్కారం

విశాఖపట్నం ముచ్చట్లు:

నూతన ఆవిష్కర్తల భాగస్వామ్యం ద్వారా పలు విభాగాల్లో పురోగతి సాధించడానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ మేనేజర్‌ అనూప్‌ కుమార్‌ సత్పతి తెలిపారు. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన రైల్వే ఇన్నోవేషన్‌ పాలసీ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ పాలసీలో ముఖ్యంగా నూతన ఆవిష్కర్తకు 1.5 కోట్ల వరకు సమాన భాగస్వామ్య ప్రాతిపదికన నిధులు అందిస్తూ రైల్వేలో పలు విభాగాల్లో పురోగతి సాధించడానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. డివిజనల్‌ స్థాయిలో అభివృద్ధి వికేంద్రీకరణ జాప్యాన్ని నివారించ డానికి మే నెలలో సమస్యాత్మక విభాగాలుగా ఇప్పటి వరకు దాదాపు 160 సమస్యలను గుర్తించామని, వాటిలో 11 సమస్యలను కొత్త ఇన్నోవేషన్‌ పాలసీ ద్వారా అభివృద్ధి చేయటనికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని తెలిపారు. వీటిలో ముఖ్యంగా రైలు పర్యవేక్షణ వ్యవస్థ, ఇండియన్‌ రైల్వే నేషనల్‌ సబర్బన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సిస్టమ్‌, ట్రాక్‌ తనిఖీ కార్యకలాపాలు, ఆటోమేషన్‌ ఎలక్ట్రోమిక్‌ ప్యాడ్‌ రూపకల్పన, త్రీ ఫేజ్‌ ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ల మానిటరింగ్‌ సిస్టమ్‌ అభివృద్ధి, ప్రయాణికుల సేవలను మెరుగుపర చడం కోసం డిజిటల్‌ డేటాను ఉపయోగించడం ద్వారా, వంతెన తనిఖీ కోసం రిమోట్‌ సెన్సింగ్‌ జామెట్రిక్స్‌ ఉపయోగం వంటివి ఉన్నాయని ఆయన తెలిపారు.

 

Tags: Solution of railway problems through Innovation Policy

Natyam ad