పుంగనూరులో విద్యుత్ సమస్యలకు పరిష్కారం
పుంగనూరు ముచ్చట్లు:
పడమటి నియోజకవర్గమైన పుంగనూరులో విద్యుత్ కష్టాలు తీర్చేందుకే రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, గనులశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీకారం చుట్టారని , ఇందులో భాగంగా సబ్‌స్టేషన్లు నిర్మించడం జరుగుతోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని గోపిశెట్టిపల్లె గ్రామంలో సుమారు రూ.2 కోట్లతో నిర్మిస్తున్న 33 కెవి సబ్‌స్టేషన్ పనులకు ట్రాన్స్కోఈఈ విజయన్, డీఈఈ రవి , సర్పంచ్ రాజారెడ్డితో కలసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పుంగనూరు మండలంలో 9 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతోందన్నారు. అలాగే చదళ్ల వద్ద 135 కెవి సబ్ స్టేషన్ పనులు కూడ జరుగుతోందన్నారు. పట్టణ, మండల వాసులకు పూర్తిగా విద్యుత్ కష్టాలు తీరిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి పరుగులు తీస్తోందని తెలిపారు. ప్రజలందరు మానమ్మకం నువ్వే జగన్….జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కోఏఈ ధనుంజయమూర్తి, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, సచివాలయల కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, రెడ్డెప్ప, రాజశేఖర్, రమణ, నంజుండప్ప, తదితరులు పాల్గొన్నారు.

Tags; Solution to electricity problems in Punganur
