Date:20/01/2021
బెంగుళూరు ముచ్చట్లు:
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలకి (ఎంఎస్ఎంఇ) బి2బి ఇ-కామర్స్ వేదికైన ఎస్ఒఎల్వి, తన ప్లాట్ ఫాం మీద ఎస్ఎంఇ కొనుగోలు, అమ్మకందార్ల కోసం ఈరోజు బై-నౌ-పే-లేటర్ (బిఎన్పిఎల్) ప్రాడక్ట్ ని ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఒక భావనగా బిఎన్పిఎల్,ఇప్పటికే రిటైల్ వినియోదారు రంగంలో పెద్దఎత్తున ప్రవేశించి, ముఖ్యంగా గత ఏడాదిగా, అక్కడ పెద్దఎత్తున విజయవంతం అయింది. బి2బి ప్రాంతంలో అలాటి తొలి ప్రయత్నాల్లో ఒకటైన ఎస్ఒఎల్వి, ఇప్పుడు ఎంఎస్ఎంఇ రంగానికి బిఎన్పిఎల్ సౌకర్యాన్ని తీసుకువచ్చింది.ఈ ప్రవేశపెడుతున్న మొదటి దశలో, ఎస్ఒఎల్విల విస్తృత నెట్వర్క్ లో భాగమైన ఆర్థిక సేవలు అందించే కొత్తతరం ఫిన్టెక్స్, ఎన్బిఎఫ్సిలు, బిఎన్పిఎల్ ద్వారా చిన్న వ్యాపారాలకు ఎస్ఒఎల్విల బి2బి కామర్స్ ప్లాట్ ఫాం మీద ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అందించడం ప్రారంభించేరు, చిన్నవర్తకులు చాలా మంది వారికి అవసరమైన పెట్టుబడి తక్కువై, ఆర్థిక అవసరాలకి మదుపు డబ్బులు లేని, కోవిడ్-19 వల్ల ఏర్పడిన సంక్షోభ కాలంలో ఇది వారికి అందివచ్చిన అవకాశంగా, అనుకూలంగా మారింది. బిఎన్ పిఎల్ వారికి లభ్యమవుతున్న అనుగుణ్యతతో, ఇప్పుడు చిన్న వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక వత్తిడిని ఎదుర్కోకుండానే తక్షణ అవసరాలని తీర్చుకోడానికి, చెల్లింపులు చేయడానికి వారికి మరింత సమయం కలిసివచ్చింది.
ఈ కొత్త విషయాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా, జితెన్ అరోరా, వెంచర్ లీడ్, ఎస్ఒఎల్విమాట్లాడుతూ, “ఎంఎస్ఎంఇ రంగంలో డిజిటల్ మార్పుతీసుకురాడంలో ముందున్న ఎస్ఒఎల్వి, ఈ పెద్ద, అతితక్కువ పట్టించుకుంటున్న విభాగాన్ని అధికారిక ఫైనాన్సింగ్ క్రిందకి తీసుకువచ్చింది. మేం సరికొత్తగా అందిస్తున్నది ఈ లక్ష్యంగా వేసే ఇంకో అడుగు అవుతుంది. బి2బి రంగంలో బిఎన్పిఎల్ వర్తింపజేయడాన్ని మా కొనుగోలుదారులు, మా అమ్మకందారులుకూడా ఆహ్వానిస్తున్నారు. ఈ ఉత్పత్తి, వారికి ఆర్థిక అనుగుణ్యతని, సౌకర్యాన్ని అందిస్తుంది, తత్ఫలితంగా సవాలుగా నిలుస్తున్న ఈ కాలంలోకూడా అది ప్రగతిలో ఫలితాలని చూపిస్తుంది. ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే, 2021 చివరినాటికి, ప్రతి మూడు ఎంఎస్ఎంఇల్లో ఒకటి ఈ ఉత్పత్తిని ఉపయోగించుకోనుంది. బిఎన్పిఎల్, 2021లో ఎస్ఒఎల్వికి 100 కోట్ల రూపాయలకన్నా ఎక్కువ మొత్తం చేస్తుందని ఆశిస్తున్నాం” అన్నారు.
TagsSOLV Introduces Buy-Now-Pay-Letter