Natyam ad

బాబు జగ్జీవన్ రాం పార్క్ లో సమస్యలను పరిష్కరించండి

తిరుపతి ముచ్చట్లు:

తుడ వి సి, కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చిన వాకర్స్ యూనియన్ నాయకులు తిరుపతిలోని కేశవాయనగుంట వద్ద గల బాబు జగ్జీవన్ రాం పార్క్ లో నెలకొన్న సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ శు క్ర వారం ఉదయం తుడ కార్యలయంలో   బాబు జగ్జీవన్ రాం పార్క్ వాకర్స్ యూనియన్ కార్య నిర్వాహక అధ్య క్షులు ఎన్. రాజా రెడ్డి అడ్వర్యంలో తుడ ఉపా ధ్య క్షులు హరి క్రిష్ణా, తుడ కార్యదర్శి లక్ష్మీలకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ 2017లో ప్రారంభిం చారని ఈ పార్క్ కు 2018లో బెస్ట్ పార్క్ అవార్డ్ లభించిందని, అటువంటి పార్క్ ప్రై వేటు వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం వలన వారు పట్టించు కొక పోవడం వల్ల అనేక సమస్యలతో కొట్టిమీ త్తాడు తుందని అన్నారు. వాకింగ్ ట్రాక్ పై ఉన్న మట్టి కొట్టుకొని పోయి రాళ్లు పైకి లేచి నడక చేసేం దుకు కష్టంగా ఉంది, అలాగే బాత్రూం లాల్లో నీరు సౌకర్యం, లైంటింగ్ లేదు, ఉదయం ఐదు గంటలకు పార్క్ తెరచినా లైటింగ్ వేయక పోవడం వల్ల ఇటీవల ఒక వ్యక్తి పాము కాటుకు గురి కావడం జరిగిందని అన్నారు. పార్క్ లో ప్రభుత్వం ఓపన్ జిమ్ ప్రథమ సారి పెట్టినా జిమ్ లోని పరికరాలు పాడై పోయినా, పార్క్ టెం డర్ వేసిన ప్రై వేటు కాంట్రాక్టర్ ఏమాత్రం పట్టించు కోలేదని అన్నారు. పార్క్ లో వాచ్ మెన్ 24గంటలు ఒక్కరినే పెట్టడం వలన కాంట్రాక్టర్ తమ వ్యాపారం కోసం పెట్టుకొన్న పరికారలను మాత్రం కాపల ఉంటరే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరికరాలను పట్టించు కోక పోవడం వల్ల పాడై పోతున్నాయని అన్నారు. కాంట్రాక్ టర్ తమ స్వార్తం కోసం చూస్తు పార్క్ ను పట్టించు కోలేదని అన్నారు. యోగ చేసుకొనేందుకు యోగా ఆడిటోరియం ఏర్పాటు చేయలని అన్నారు. అనంతరం వి సి స్పందిస్తూ తొందరలో పార్క్ ను సందర్సి స్తానని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్య క్రమంలో వాకర్స్ అసోషియేషన్ నాయకులు ఆనంద రాజు, బాల క్రిష్ణా, మోహన్ రెడ్డి, వేనుగోపాల్ రాయల్, కారుమంచి ఆనంద్, కుమారస్వామి నాయుడు, జమానుల్లా, నూరుల్లా, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Solve problems in Babu Jagjeevan Ram Park

Post Midle