న్యాక్ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించండి.

-గౌతం రెడ్డి ఆధ్వర్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి కి వినతి పత్రం సమర్పించిన ఉద్యోగులు.

 

తాడేపల్లి ముచ్చట్లు:

 

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ యూనియన్ (న్యూ) ఆధ్వర్యంలో లో సోమవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పి గౌతం రెడ్డి, న్యూ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎన్ రాజారెడ్డిల ఆధ్వర్యంలో న్యాక్ ఉద్యోగస్తులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ న్యాక్ సంస్థను ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేశారని కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు దీని గురించి పట్టించుకోక పోవడం వలన వీళ్ళు చాలా నష్టపోతున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరి రెగ్యులరైజేషన్ గురించి గానీ వీరి సమస్యల గురించి గానీ ఏ మాత్రం పట్టించుకోలేదు. 13 జిల్లాల్లో నిర్మాణ రంగం నందు అనుభవంతో పాటు టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ అర్హత కలిగిన 250 మంది గత 23 సంవత్సరాలుగా పని చేస్తున్న గత ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించలేదన్నారు.

 

 

 

 

సీనియారిటీ దృష్టిలో ఉంచుకొని వారికి ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన పిఆర్సి,టైం స్కేల్, సమాన పనికి సమాన వేతనం అమలు చేసేందుకు కృషి చేయాలని కోరారు. న్యూ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎన్ రాజారెడ్డి మాట్లాడుతూ న్యాక్ సంస్థకు పర్మినెంట్ ఐఏఎస్ అధికారిని డైరెక్టర్ జనరల్ గా నియమించాలని, వీరికి 0.01% నిర్మాణ రంగం నుంచి సెస్ రూపంలో నిధులు వస్తున్నప్పటికీ వీరి సమస్యలను పరిష్కరించకపోవడం శోచనీయం అన్నారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందిస్తూ మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ యూనియన్ (న్యూ) గౌరవ అధ్యక్షులు ఎన్ రాజా రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు జి శంకరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, కోశాధికారి డి కిరణ్ కుమార్ రెడ్డి మరియు సంయుక్త కార్యదర్శి జయలక్ష్మి పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Solve the problems of NAC employees.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *