నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

పుంగనూరు ముచ్చట్లు:

 

నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు, ఆఫీసర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సంఘ నాయకులు వినతిపత్రాన్ని దేశం ఇన్‌చార్జ్ చల్లాబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. మంగళవారం సంఘం నాయకులు చల్లాబాబును కలసి ఉద్యోగులకు శాశ్వత భవనం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని కోరారు. అలాగే అందుకు తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు డాక్టర్‌ ఖాన్‌, మురళిబాబు, కృష్ణమూర్తి, తెలుగుదేశం నాయకులు, సీనియర్‌ న్యాయవాది వెంకటముని యాదవ్‌, సివి.రెడ్డి, గిరి, మాధవరెడ్డి, సుబ్రమణ్యంరాజు, శ్రీకాంత్‌, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Solve the problems of non-gazetted employees

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *