అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి-జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప ముచ్చట్లు:

ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన   “స్పందన”   కార్యక్రమం ద్వారా స్వీకరించిన  అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల  అధికారులను  జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో..    ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన”  కార్యక్రమం  జరిగింది.  ఈ  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు జాయింట్ కలెక్టర్  సాయికాంత్ వర్మ , ఇంఛార్జి డిఆర్వో వెంకటేష్,  డిఆర్డీఏ, ఏపీఎంఐపి  పీడి  మధుసూదన్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ రామమోహన్,  అనుడ విసి శ్రీలక్ష్మి..లు  హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ….  ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా  నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.   పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలాఅర్జీలనుపరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారులనుండి  వారు అర్జీలను స్వీకరించారు
స్పందన ద్వారా.. ప్రజల నుండి  అందిన విజ్ఞప్తులలో కొన్ని…

 

 

పులివెందుల మండలం బలపనూరు గ్రామానికి చెందిన డి సుశీల అనే మహిళ కొంత భూమిని కొని ప్రభుత్వ సర్వేయర్ ద్వారా కొలతలు వేయించుకుని  వ్యవసాయం చేసుకుంటూన్నానని  అయితే నా పొలం  పక్కనే ఉన్న  ఒక వ్యక్తి  నా పొలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆయన నుంచి నా పొలాన్ని కబ్జా కాకుండా చూసి న్యాయం చేకూర్చాలని స్పందనల్లో అర్జీ సమర్పించారు.కడప పట్టణం చిన్నచౌక్  చెందిన జె అయ్యవారు అనే వ్యక్తి కూలీ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని ఇంతవరకు నాకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేదని, ప్రభుత్వం జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాన్ని  మంజూరు చేయాలని కోరుతూ స్పందనలో అర్జీ సమర్పించారురైల్వే కోడూరు మండలం కమటం వారి పల్లె చెందిన మదుతల ఖరిముని అనే మహిళ తనకు వికలాంగుల కోటా కింద వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని స్పందనలో అర్జీ సమర్పించారు.కాశి నాయన మండలం సాలి శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఎం. దావీదు అనే వ్యక్తి మా గ్రామంలో కొంత వ్యవసాయ భూమి  ఉందని అయితే అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నాభూమిని ఆక్రమించాలనిచూస్తున్నారని,దీనిపై అధికారులకుఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వారిపై తగిన చర్య తీసుకుని న్యాయం చేకూర్చాలని స్పందన అర్జీ ద్వారా కోరారు.ఈ కార్యక్రమంలో  గ్రౌండ్ వాటర్  డిడి మురళి,  సమగ్ర శిక్ష పీడి   ప్రభాకర రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.నాగరాజు,  ఎల్డిఎం దుర్గా ప్రసాద్, రిమ్స్ సూపర్ ఇన్ టెండెంట్ డా.వెంకటేశ్వర రావు, గృహనిర్మాణ శాఖ పీడి కృష్ణయ్య, ఎస్ సి  కార్పొరేషన్ ఈడి వెంకట సుబ్బయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి బ్రహ్మయ్య,   జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు,  జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి,   అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Solve the problems of the petitioners expeditiously – District Collector V. Vijay Ramaraju