పదేళ్ల నీటి ఎద్దడికి 10 లక్షలతో నీటి సమస్య పరిష్కారం

పత్తికొండ  ముచ్చట్లు:
పట్టణంలోని పదేళ్ల నుంచి తీవ్రంగా నీటి ఎద్దడి తీర్చడానికి 10 లక్షలతో నీటి సమస్య పరిష్కారం చేయడానికి శ్రీకారం చుట్టామని పత్తికొండ గ్రామ సర్పంచ్ కొమ్ము దీపిక, మాజీ మండల అధ్యక్షురాలు షిరిడి సాయి బాబా ట్రస్ట్ చైర్మన్ వైఎస్ఆర్సిపి నాయకురాలు నాగరత్నమ్మ అన్నారు. సోమవారం మార్కెట్ యార్డ్ దగ్గర పైప్ లైన్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది ఏళ్ల నుంచి తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదనను వ్యక్తం చేశారు. టీచర్ కాలనీ,ఎస్సి కాలనీ, చింతకాయల గేరి, రామకృష్ణా రెడ్డి నగర్, కొండగేరి, కొత్తపేట కాలనీలకు ఐదు ఆరు రోజులకోసారి నీళ్లు రావడం తో తీవ్ర అవస్థలు పడ్డారని చెప్పారు. వివాహాలకు,ఉత్సవాలకు, జాతర్లకు నీళ్లు లేక అన్ని వర్గాల ప్రజలు నానావస్థలు పడ్డారన్నారు. ప్రజల కష్టాలను స్వయంగా చూడటం వల్లనే 10 లక్షలతో సెక్షన్ 5 లైన్ తో ఒక్కొక్క కాలనీ కి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 3 వేల కుటుంబాలకు చెందిన 15 వేల మందికి నీరు అందించబోతున్నామన్నారు. నీటి కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఈఓ కృష్ణ కుమార్ మాట్లాడుతూ 24 గంటలలో నీటి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. పైపు లైన్ మంగళవారం నాటికి పనులు పూర్తి అవుతాయన్నారు. బుధవారం నుంచి పాత పేట కాలనీలకు నీరు సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కళావతి, మాజీ సర్పంచ్ సోమశేఖర్, వైఎస్సార్ సీపీ నాయకులు, వార్డు మెంబర్లు శ్రీకాంత్ రెడ్డి, మస్తాన్, వేణుగోపాల్, సుంకన్న, రంగన్న,మధు, శేక్షావలి పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Solve the water problem with 10 lakhs for ten year water crisis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *