Natyam ad

పుంగనూరులో గడప గడపలో సమస్యలు పరిష్కారం – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి.

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని తమ్మరాజుపల్లె,  సిద్దారెడ్డిపల్లె, కుమ్మరగుంట , కొండందొడ్డి గ్రామాల్లో మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలసి పర్యటించారు. జగనన్న సంక్షేమబావుట పుస్తకాలను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలకు అందిస్తున్న పథకాలను , బుక్‌లెట్ల ద్వారా అందించి వివరిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మునస్వామి, ఎంపీటీసి సూరప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, రమణ, రామచంద్రారెడ్డి, రాజారెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Solving problems in Gadapa Gadapa in Punganur – MPP Bhaskar Reddy.

Post Midle

Leave A Reply

Your email address will not be published.