Solving problems in response

స్పందనలో సమస్యలు పరిష్కారం

Date:20/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. సోమవారం ఆయన స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 16 మంది వినతిపత్రాలను అందజేశారు. అర్జీ దారులకు రశీదులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు స్పందనలో వచ్చే అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. పెన్షన్లు, గృహనిర్మాణాలకు సంబంధించి అర్జీల నివేదికలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, మున్సిపల్‌ ఉద్యోగి శ్రీనివాసులు పాల్గొన్నారు.

మున్సిపాలిటిలోకి చేరిన నక్కబండ

Tags: Solving problems in response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *