తిరుచ్చిపై సోమస్కందమూర్తి

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శ‌నివారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ‌లు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.శివచింతన కోసం కొందరు పర్వతగుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసం చేస్తున్నారు. మరికొందరు శీతాకాలంలో గంగాజలాలలో దిగి తపమాచరిస్తున్నారు. ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యలో ఒంటికాలి మీద నిలిచి ఘోర తపస్సు ఆచరిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ తమ చిత్తసరోజాలను పరమేశ్వరార్పణ చేయడానికే. కానీ మహాదేవుడైన కపిలేశ్వరస్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల చిత్తం అయత్నంగా పరమశివ పదాయత్తమవుతుంది.వాహ‌న సేవ‌లో ఆలయ డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.
 
Tags: Somaskandamoorthy on Trichy