ఏపీకి చేరుకున్న సోమేష్ కుమార్
గన్నవరం ముచ్చట్లు :
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో చీఫ్ సెక్రటరీని కలిసి జాయినింగ్ రిపోర్టర్ ఇవ్వనున్నాను.అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఏపీలో రిపోర్టు చేయమంటే వచ్చాను. ఏపీలో ఏవిధంగా ఉంటే ఆవిధంగా పని చేయడానికి రెడీ. ప్రభుత్వ ఉద్యోగిగా ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా. హోదాతో పని లేకుండా పనిచేస్తానని అన్నారు.
Tags: Somesh Kumar reached AP

