Natyam ad

కుటుంబ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు

– తనకు ముగ్గురు కూతుళ్ళు..ఇద్దరు అల్లుళ్ళు
-ఆతను నా అల్లుడు కాడు
అమరావతి ముచ్చట్లు:
 
 
తన కూతురుతో పాటు కుటుంబ వ్యవహారాలపై సైతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు ముగ్గురు కూతుళ్లు ఉన్నా కూడా..ఇద్దరు అల్లుళ్లే అంటూ సోము బాంబు పేల్చారు.తాను తన పెద్దమ్మాయికి పెళ్లి చేయలేదని.. ఆమే ఇంటినుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందని సోము చెప్పారు. తాను కాళ్లు కడిగి కన్యాదానం చేయలేదు కాబట్టి.. అతడు నా అల్లుడు కాదని సోము సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కన్యాదానం చేయకపోవడంతో తన పెద్ద కుమార్తె భర్తను తాను ఇప్పటకి అల్లుడిగా గుర్తించడం లేదన్నారు. గతంలోనే తాను అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అతడికి తనకు ఎలాంటి సంబంధం లేదని సోము చెప్పారు.దయచేసి ఈ కేసు విషయంలో తన పేరు ప్రస్తావించవద్దని చెప్పిన సోము అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం. ఇక సోము పెద్ద అల్లుడిపై చీటింగ్ ఫోర్జరీ కేసు నమోదు అయ్యింది. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసిన అతడు కొవ్వూరు ఎస్బీఐలో లోన్ తీసుకున్నాడని జయరామకృష్ణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు ఈ కేసును క్షుణ్ణంగా విచారించిన పోలీసులు సోమువీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై ఐపీసీ 406 419 420 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
 
 
ఈ కేసుపై సోము కుమార్తె సూర్యకుమారి కూడా స్పందించారు. తన తండ్రికి ఈ లోన్కు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. ఇక తన తండ్రితో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన పెళ్లి తర్వాత తన తండ్రి ఇప్పటకీ తమ ఇంటికి రాలేదని ఆమె చెప్పారు. ఇక వ్యాపార లావాదేవీల్లో భాగంగానే ఈ కేసు పెట్టారని చెప్పిన ఆమె.. తమను ఈ కేసులో ఉద్దేశ పూర్వకంగానే ఇరికించారని ఆమె ఆరోపించారు.ఇక కొందరు తన తండ్రి ప్రతిష్ట దెబ్బతీసే రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పారు. ఏదేమైనా సోము వీర్రాజు కుటుంబంలో ఇంత ఇష్యూ ఉందన్న విషయం ఆయన చెప్పే వరకు ఎవ్వరికి తెలియదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్ ఫోర్జరీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సోము అల్లుడిపై కేసు నమోదు.. సోము ఎలా స్పందిస్తాడో ? చూడాలి అంటూ ఒక్కటే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇప్పుడు మీడియాలో హైలెట్ కావడంతో సోము స్పందించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Somu Weeraju made key remarks on family matters