కొడుకు మరణం తట్టుకోలేక ఆత్మహత్య
విజయవాడ ముచ్చట్లు:
పురాణాలు చదివినా.. ఇటు సినిమాల్లో చూసినా.. నాన్న ప్రేమ గురించి కాస్త తక్కువగానే చెప్పినట్లు అనిపిస్తుంది. అమ్మ ప్రేమ గురించి చెప్పినంతగా, చూపించినంతగా నాన్నకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ నాన్న బిడ్డలపై చూపించే ప్రేమ ఏమాత్రం తక్కువకాదు. తాజాగా కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని ఓ తండ్రి ప్రాణాలు తీసుకోవడవం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక అంబేద్కర్ నగర్‌లో భార్య, కుమారుడితో కలిసి లక్ష్మణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని తనయుడు గత కొంతకాలంగా మూర్చవ్యాధితో సతమతమవుతున్నాడు. ఆరోగ్య సమస్యలు తీవ్రం అవ్వడంతో.. గురువారం మరణించాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తనయుడి మృతిని లక్ష్మణ్ జీర్ణించుకోలేకపోయాడు. బిడ్డ లేకుండా తాను బ్రతకలేనంటూ మనసులో కుమిలిపోయి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్క రోజు వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర నైరాశ్యం నెలకుంది. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అంబేద్కర్ నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Son commits suicide unable to bear death