అన్నగారి బాటలో అల్లుడు

Date:28/09/2020

విజయవాడ  ముచ్చట్లు

నన్ను ఇంతలా అవమానించిన ఈ అసెంబ్లీ ముఖం నేను చూడను అంటూ 1993 టైంలో అన్న నందమూరి తారక రామారావు కాంగ్రెస్ సర్కార్ మీద కస్సుమన్నాదు. తిరిగి వస్తే రాజమార్గాన ముఖ్యమంత్రి గానే అసెంబ్లీలో అడుగుపెడతాను అని శపధం చేసి మరీ ఎన్టీఆర్ నాడు బాయ్ కాట్ చేశారు. అదే వరసలో తమిళనాట విపక్ష నేతగా ఉన్న జయలలిత నాటి సీఎం కరుణా నిధి తనను నిండు సభలో అవమానించారని చెబుతూ అసెంబ్లీకి విపక్ష నేతగా ఇక రాను. మళ్ళీ అడుగుపెట్టేది చీఫ్ మినిస్టర్ గానే అంటూ భారతంలో ద్రౌపది మాదిరిగా వీరనారి శపధం చేశారు. ఇక ఏపీలో చూసుకుంటే మూడేళ్ళ క్రితం జగన్ కూడా అదే విధంగా తన ఎమ్మెల్యేలను లాక్కుని మంత్రులుగా చేసిన చంద్రబాబు సీఎం గా ఉండగా అసెంబ్లీకి వచ్చేది లేదని గట్టి ప్రతిన పూనారు. ఆయన కూడా సీఎంగానే తిరిగి అసెంబ్లీకి వచ్చారు.ఇపుడు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుకు తరచూ అవమానమే జరుగుతోందని తమ్ముళ్ళు అంటున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు అవతల వైపు ఉన్నారు. వారికి మద్దతుగా టీడీపీ నుంచి కొందరు వెళ్లారు, ఇక జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా జై జగన్ అంటున్నారు.

 

పట్టుమని పదిహేను మంది కూడా చంద్రబాబు వైపు లేరు. వీరిలో నోరు విప్పేవారు పెద్దగాలేరు. ఈ దైన్య స్థితిలో బాబు అసెంబ్లీకి వస్తే జగన్ టీం చెడుగుడు ఆడేస్తోంది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా నాటి సభలో జరిగిన దానికి రివర్స్ అటాక్ చేస్తోంది. దీన్ని చంద్రబాబు పెద్ద గుండెతోనే ఇన్నాళ్ళూ తట్టుకున్నారు. కానీ అంతకు మించి పరాభవం జరిగితే మాత్రం ఆయనకు ఇక సభకు వచ్చినా ఉపయోగం లేదని తమ్ముళ్ళే అంటున్నారుట.ఈసారి జగన్ ఎపుడు అసెంబ్లీని పెట్టినా చంద్రబాబుని జస్ట్ ఎమ్మెల్యేగానే చూస్తారుట. అంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తారన్న మాట. ఇప్పటికే టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు గుడ్ బై కొట్టారు, విశాఖ నుంచి మరో ఇద్దరు సైకిల్ ఎక్కే సూచనలు పక్కాగా కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే బాబుకు విపక్షహోదా పోవడం ఖాయం. మ్యాజిక్ ఫిగర్ 18 కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలతో బాబు కూడా అందరిలా సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. ఈ మాస్టర్ ప్లాన్ తోనే వైసీపీ ముందుకు కదులుతూండడంతో చంద్రబాబుకు విపక్ష వైభోగం గతమేనా అన్న మాట వినిపిస్తోంది.

 

 

ఇక చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడే వైసీపీ చుక్కలు చూపించింది. అయినా బాబు తను అపోజిషన్ లీడర్ ని అని, మైక్ కోసం గట్టిగా గొడవచేసేవారు, జగన్ తో సమానంగా టైం తీసుకుని మాట్లాడేవారు, ఇపుడు ఆ పరిస్థితి ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చే సమయమే ఆయనకూ ఇస్తారు. పైగా అది స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ చేసి మైక్ అడిగే సీన్ చంద్రబాబుకు ఉండకపోవచ్చు. అదే జరిగితే మాత్రం అంతకంటే అవమానం చంద్రబాబు రాజకీయ జీవితంలో ఉండదు, మరి దానికి కూడా సిద్ధపడి అసెంబ్లీకి వస్తారా అంటే తమ్ముళ్లకైతే అది ఇష్టం లేదు అంటున్నారు. తనకు అపోజిషన్ హోదా లేకుండా వైసీపీ చేస్తే మాత్రం చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లకుండా బాయ్ కాట్ చేస్తారని అంటున్నారు. అటే ఒక ఎన్టీయార్, జయలలిత, జగన్ మాదిరిగా బాబు చాణక్య శపధం చేస్తారన్న మాట. 

 

ఎల్జేపీ… దెబ్బ తప్పదా

Tags:LJP … don’t miss the blow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *