తల్లిని నిర్లక్ష్యం చేసిన కొడుకుకు జైలు శిక్ష
నరసాపురం ముచ్చట్లు:
వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసేవారికి ఇదో హెచ్చరిక. వృద్ధులకు కూడా ప్రత్యేక చట్టాలు ఉంటాయి.. ఎవరైనా వాటిని అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని నిరూపించారు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ సూర్య తేజ… సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ హోదాలో ఆయనకు ఉన్న అధికారాలను వినియోగించి వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకు , కోడలకు రెండు వారాలు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు.
నరసాపురం పట్టణానికి చెందిన పుల్లూరి నాగమణి భర్త చనిపోవడంతో కొడుకు వెంకన్న బాబు దగ్గర ఉంటుం ది.. అయితే గత కొంతకాలం గా కొడు కు కోడలు రేవతీలు ఇద్దరూ నాగమణి ని చిత్రహింసలు పెడుతున్నారు. తిండి సరిగా పెట్టకపోవడం, బాత్రూం కి వెళి తే తలుపు వేయటం, తల్లిని కొట్టడం వంటి దుర్మార్గ చర్యలకు పాల్పోవటం తో నాగమణి గత ఏడాది జూన్ నెలలో సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది.
స్వీక రిం చిన సబ్ కలెక్టర్ సూరితేజ ముందుగా కొడుకు కోడలను పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. అయినా వారి పద్ధతి మారలేదు. దీంతో సబ్ కలెక్టర్ తన పరిధిలో ఉన్న ట్రిబ్యునల్ కోర్టులో విచారణ చేపట్టారు. ఇందులో కొడుకు కోడలు వృద్ధురాలైన నాగమణిని చిత్రహింసలు పెట్టడం వాస్తవమని తెలియడంతో వీరిద్దరికి జైలు శిక్ష విధించి, వారు ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి, అందులో నాగమణి నివాసం ఉండే విధంగా, కింద ఉన్న పోర్షన్ అద్దెకిచ్చి, వచ్చే అద్దెతో ఆమె జీవనం సాగించేలా తీర్పు చెప్పారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదాలో సబ్ కలెక్టర్ తీర్పు పై బాధితురాలు నాగమణి సంతృప్తిని వ్యక్తం చేసింది కొడుకు కోడలు తనను చిత్రహింసలు గురి చేశారని, తన ఇల్లు తనకు అప్పగిస్తే చాలునని బావో ద్రే కానికి గురయింది.

Tags; Son jailed for neglecting mother
