ప్రజలను చైతన్య పరుచడంలో పాటలే కీలకం

– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date:08/05/2020

పెద్దపల్లి ముచ్చట్లు:

సమాజ హితంలో భాగంగా ప్రజలను చైతన్య పరుచడంలో పాటలు పాత్ర కీలకమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సదశయ పౌండేషన్ వారి కరోనాతో కనువిప్పు ఆడియో సిడిని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలకు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత అలవడినయన్నారు. వైరస్లకు దూరంగా ఉండాలంటే ప్రజలందరు తమ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అలవాటు అయ్యిందన్నారు. ప్రజల్లోకరోనాపై మరింత అవగాహన కలిగేందుకు సదశమ పౌండేషన్ సిడి ఆవిష్కరణ చేయడం అభినందనీయమన్నారు. ఈ నగర మేయన్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, దయానంద్ గాంధీ, లింగమూర్తి తదితరులు పాల్గోన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా

Tags: Songs are key in motivating people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *