పశ్చిమలో కౌలు రైతుల పాట్లు

ఏలూరు ముచ్చట్లు :

 

అన్నదాతను ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోంది. మొన్నటి వరకూ సంచుల కొరత వంటి అనేక కారణాలతో ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో, ఖరీఫ్‌కు పెట్టుబడులు అవసరమైన సమయంలో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. జిల్లాలో గత రబీలో 4.70 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. 340 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 11.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ప్రభుత్వం వారం నుంచి పది రోజులలోగా డబ్బులు చెల్లించాలి. 40 రోజులు అయినా డబ్బులు అందని వారు ఉన్నారు. రైతులకు రూ.1,300 కోట్లకుపైగా ప్రభుత్వం బకాయి పడింది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. తొలకరి వర్షాలు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులకు వ్యవసాయ పెట్టుబడులు అవసరం. ధాన్యం డబ్బులు అందనందున కోత మిషన్‌, ధాన్యం తోలు కిరాయిలు, పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులపై అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగింది.

 

 

 

ఇప్పుడు మళ్లీ కొత్తగా పెట్టుబడులు అవసరం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ధాన్యం బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 75 శాతం సాగు వీరే చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెట్టాల్సి రావడంతో పాటు, ఎకరా ఒక్కంటికి 15 బస్తాలను కౌలు కింద భూ యాజమానికి ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో రెండు లక్షల మందికి పంట సాగుదారుని హక్కు పత్రాలు (సిసిఆర్‌సి కార్డులు) ఇవ్వలేదు. భూయజమానుల అంగీకారంతో సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలని వైసిపి ప్రభుత్వం చట్టంలో మార్పు చేయడంతో కౌలు రైతులు నష్టపోతున్నారు. భూయజమానులు అంగీకారం ఇవ్వకపోవడంతో ఈ కార్డులకు కౌలు రైతులు నోచుకోవడం లేదు. సిసిఆర్‌సి కార్డు లేకుండా కౌలు రైతులకు నేరుగా ధాన్యం డబ్బులు జమ చేయడం కుదరదని అధికారులు చెబుతున్నారు. ధాన్యం డబ్బుల బకాయిలపై పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ డి.రాజును వివరణ కోరగా, వచ్చే వారంలో జమవుతాయని తెలిపారు. సిసిఆర్‌సి కార్డులు లేని కౌలు రైతులు వ్యవసాయాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని ఇవ్వాలన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Songs of tenant farmers in the west

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *