మోదీ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన సోనియాగాంధీ

Sonia Gandhi is the flames of Modi failures

Sonia Gandhi is the flames of Modi failures

Date:14/12/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కేంద్రంలోని మోదీ సర్కార్ తీరు, అనుసరిస్తున్న విధానాలు, మోదీ వైఫల్యాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. ఒక అధికరణను బలవంతంగా రుద్దాలన్నీ, తొలగించాలన్నా, రాష్ట్ర హోదా మార్చాలన్నా…ఇలా వారికి ఏది తోస్తే అలా చేస్తూ పోతున్న పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం, రద్దు చేయడం, చర్చ లేకుండానే బిల్లులు ఆమోదించుకుంటూ పోతున్నారని మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. శనివారంనాడు రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున నిర్వహించిన ‘భారత్ బచావో’ ర్యాలీలో సోనియాగాంధీ ఉద్వేగంగా ప్రసంగించారు.పౌరసత్వ సవరణ చట్టంతో భారతీయ ఆత్మ ముక్కలు చెక్కలు అవుతున్నా, అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నా మోదీ, అమిత్‌షాలకు ఎలాంటి పట్టింపు లేకుండా పోయిందని సోనియాగాంధీ విమర్శించారు.

 

నిర్భయ దోషుల ఉరి శిక్షను టీవీ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి

 

Tags:Sonia Gandhi is the flames of Modi failures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *