Natyam ad

రాహుల్ తో కలిసి నడిచిన సోనియాగాంధీ

మాండ్యా ముచ్చట్లు:


కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో మొదటిసారి గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. అనారోగ్యంతో చాలా కాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సోనియాగాంధీ గురువారం మాండ్యాలో కాంగ్రెస్ కార్యకర్తలు వెంటరాగా తనయుడు రాహుల్ తో కలిసి నడిచారు.  బుధవారం బేగూర్ గ్రామంలో ని దేవాలయాన్ని సోనియా సందర్శించారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి  నుంచి సెప్టెంబరు 7వతేదీన ప్రారంభించిన భారత్ జోడో యాత్ర గత నెల 30వతేదీన బీజేపీ పాలిత కర్ణాటకలోకి ప్రవేశించింది. సోనియా గాంధీ మైసూరు రాకతోపాటు ఆయుధ పూజ, విజయదశమి సందర్భంగా రెండు రోజులపాటు విరామం ఇచ్చారు. రాహుల్ పాదయాత్రలో సోనియా పాల్గొనడం తమ కర్ణాటక రాష్ట్రానికి గర్వకారణమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు. విజయదశమి తర్వాత సోనియా గాంధీ కర్ణాటకలోని వీధుల్లో పాదయాత్ర చేయడం వల్ల బీజేపీ దుకాణం బంద్ అయి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని శివకుమార్ వ్యాఖ్యానించారు.

 

Tags: Sonia Gandhi walked with Rahul

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.