సోనియా రాహుల్ లకు విడి నోటీసులు ఇచ్చిన విషయం పై ఆగ్రహం
-పోలీసుల రంగప్రవేశం
-వెంకట్ బృందం అరెస్ట్
హైదరాబాద్ ముచ్చట్లు:

ఏఐసిసి అగ్ర నాయకులు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఈడి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం తెల్లవారుజామున రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ను ముట్టడించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఏఐసిసి అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి ఈడి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విధితమే.ఈ పిలుపు మేరకు ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి సారథ్యంలోని తెలంగాణ ఎన్ ఎస్ యు ఐ బృందం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో రాజ్ భవన్ ని ముట్టడించి నిరసన తెలిపారు. పోలీసులు రాష్ట్ర అధ్యక్షుడితో కూడిన బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులపై బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఏఐసిసి అగ్ర నాయకులు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఈడి నోటీసులు ఇచ్చిందని,ఇది బీజేపీ దమన నీతికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
Tags:Sonia is angry over the issue of separate notices to Rahul
