సోనియా ప్రసంగంలో ఆయోమయం

Sonia is confused in speech

Sonia is confused in speech

Date:24/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మేడ్చల్ సభలో సోనియా గాంధీ ప్రసంగం వింటే వారు తెలంగాణ ఎన్నికల ప్రచార సభకు వచ్చారా.. లేదా పక్క రాష్ట్ర ఎన్నికల ప్రచార సభకు వచ్చారన్న అయోమయంలో తెలంగాణ ప్రజలు పడ్డారు. తెలంగాణ గడ్డపైన మొదటిసారిగా కాలు పెట్టిన సోనియా గాంధీ ఇక్కడి ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా పక్క రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం వింతగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ వైఖరిని తిరస్కరిస్తారు. చంద్రబాబు నాయుడి చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మ అని, తెలంగాణ కాంగ్రెస్ ను చంద్రబాబు డీఫాక్టో ప్రెసిడెంట్ గా నడిపిస్తున్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. సోనియా గాంధీ గారి ప్రసంగ స్క్రిప్ట్ ను చంద్రబాబు నాయుడు రాసిచ్చినట్టి ఉంది. ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు తెలంగాణపై పెత్తనానికి ప్రణాళికలు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ వ్యతిరేక కూటమికి ఎంత తక్కువ విషయం ఉందో ఈ సభతో తేలిపోయింది.
డబ్బుతో వేల మందిని తరలించి నిమిషాలలో కూడా మాట్లాడలేని కూటమినాయకులు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిస్థితి చూస్తే తెలంగాణ ప్రజలకు ఏం చెప్పి ఓటు అడగాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఈ తెలంగాణ వ్యతిరేక కూటమి ఉన్నదన్నది స్పష్టమైందని అయన అన్నారు. అమ్మ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడను అన్న రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులు ఎలా అయ్యారు? ప్రజలను పిలిచిన సభలో కూడా కుటుంబవ్యామోహమేనా? కూటమిలో భాగమైన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ సభకు రాకుండా ముఖం ఎందుకు చాటేశారు అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. తెలంగాణ ప్రజలు వారిని తిరస్కరిస్తారని తెలుసేమో? రాహుల్ గాంధీ గారు ఎయిర్ పోర్ట్ నుంచి మేడ్చల్ వచ్చినంత సమయం కూడా మాట్లాడలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉంది. అయిదు రాష్ట్రాలలో చిత్తుగా ఓడిపోతున్నాము అన్న బాధ, భయం తల్లీ కొడుకుల ముఖాలపై ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయనా అయన వ్యాఖ్యానించారు.
Tags:Sonia is confused in speech

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *