Natyam ad

 మళ్లీ సోనియాకే బాధ్యతలు..?

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

అవును. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు సోనియా చెంతకు చేరుతుందా? మరోసారి, ఆమె ఆ బాధ్యతలను భుజానికి ఎత్తుకోక తప్పదా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న బహుముఖ సంక్షోభం వెనక పైకి కనిపించే కోణం ఒకటైతే, అంతర్గతంగా వినిపిస్తున్నకథనం మరోలా ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. పార్టీ పగ్గాలు కుటుంబేతరులకు అప్పగించేందుకు సోనియా గాంధీ ఎంత మాత్రం సుముఖంగా లేరు. అంతే కాదు, చివరకు ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఆమె మనసు అంగీకరించడం  లేదు. కూతురు మనమ్మాయే అయినా అల్లుడు మన వాడు కాదు, పైగా, అతగాడు మామూలోడు కూడా కాదు. నిజానికి, ఇప్పటికే పార్టీలో ఒక వర్గం వాద్రా కనుసన్నల్లో పనిచేస్తోందనే అనుమాన, భయాలు సోనియాను వెంటాడు తున్నాయి.

 

 

Post Midle

అందుకే 2019లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సందర్భంగా, సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక తప్పని పరిస్థితిని సృష్టించి, తాత్కాలిక అనే ట్యాగ్ లైన్ తో బాధ్యతలు స్వీకరించారు.ఇప్పుడు అదే పద్దతిలోనే మరో మారు, అదే పరిస్థితి క్రియేట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని, పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి పార్టీ పగ్గాలు వదిలితే, ఇక మళ్ళీ పార్టీని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం అయ్యే పని కాదని సోనియా గాంధీ చాలా గట్టిగా నమ్ముతారనేది ఎవరూ కాదనలేని నిజం. నిజానికి, ఒక్క కాంగ్రెస్ అనే కాదు, ఏ కుటుంబ పార్టీ కూడా పార్టీ పగ్గాలు కుటుంబ వ్యక్తులకు అప్పగించరు. అలాంటిది  ఒకసారి పార్టీ పగ్గాలు వదిలితే ఎమౌవుతుందో అనుభవ పూర్వకంగా తెలుసు కున్న సోనియా గాంధీ, అందుకు అసలే ఇష్టపడరని అంటున్నారు. రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం తర్వాత, పీవీ నరసింహ రావు, సీతారాం కేసరికి పార్టీ ప్రభుత్వ పగ్గాలు వదిలేసిన సమయంలో ఎదురైన చేదు అనుభవాలు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే 2019లో రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా గాంధీ కుటుంబం బయటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పట్టు పట్టినా ఆమె అది తమకు మోయలేని భారమే అయినా ఆ బరువు బాధ్యతలను నెత్తి కెత్తుకున్నారు. ఏదో ఒకనాటికి రాహుల్ గాంధీ మనసు మార్చుకుని పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ఆశించారు. అయితే మూడేళ్లయినా,

 

 

 

రాహుల్ తీరు మాలేదు. బాధ్యతలు లేని అధికారాలకు అలవాటు పడిన రాహుల్  పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇప్పటిలానే, ఎప్పటికీ ‘అధినాయకుడు’ గా ఉండి పోయేందుకే నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో విధేయుడు అనుకున్న అశోక్ గెహ్లాట్ ను, అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే ఎన్నికకు ముందే తిరుగుబాటు జెండా ఎగరేశారు. అఫ్కోర్స్, అది కూడా సోనియా స్క్రిప్ట్ లో భాగమనే వాదన మరొకటి ఉందనుకోండి అంది వేరే విషయం. గెహ్లాట్ తిరుగుబాటు, సోనియా  రాహుల్  స్క్రిప్ట్ ప్రకారం జరిగినా  గెహ్లాట్ స్వయంగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కథ నడిపినా, సోనియా గాంధీ మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించే  అవకాశం లేదని, అంతర్గత వర్గాల వర్గాల సమాచారం.అందుకే మళ్ళీ మరోమారు రాహుల గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే  రాగాలు మొదలయ్యాయని అంటున్నారు.అలాగే కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, ఏకే అంటోనీ, ముకుల్ వాస్నిక్, ఖర్గే వంటి మరికొందరు ‘విధేయుల’ పేర్లు ప్రచారం లోకి వచ్చినా, చివరకు రాహుల్ గాంధీ అంగీకరించని పక్షంలో మళ్ళీ  ఫిర్ ఏక బార్ సోనియానే పార్టీ చీఫ్ అంటున్నారు.  అయితే ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇది ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు శుభం కార్డు ఎప్పుడు, ఎలా పడుతుందో … చూడవలసిందే అంటున్నారు.

 

Tags: Sonia is responsible again..?

Post Midle