సోనియా ఒక్క‌రే 

Date:24/05/2019

లక్నో ముచ్చట్లు:

ఉత్త‌రప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ కేవ‌లం ఒకే సీటుకు ప‌రిమితమైంది. రాయ‌బ‌రేలీ నుంచి సోనియా ఒక్క‌రే తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచారు. దీంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వికి రాజ్ బ‌బ్బ‌ర్ ఇవాళ రాజీనామా చేశారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని రాహుల్‌కు పంపారు. ఫ‌తేపుర్ సిక్రీ నుంచి పోటీ చేసిన రాజ్‌బబ్బ‌ర్ బీజేపీ చేతిలో ఓడిపోయారు. తాజా ఎన్నిక‌ల్లో ఘోరంగా పార్టీ విఫ‌లమైన నేప‌థ్యంలో రాజ్‌బ‌బ్బ‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. యూపీలోని అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ కూడా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ జిల్లా కాంగ్రెస్ చీఫ్ రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. దేశ‌వ్యాప్తంగా ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ అనేక మంది కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తూ రాహుల్‌కు లేఖ‌లు పంపిస్తున్నారు.  కాంగ్రెస్ క‌మిటీ స‌మావేశాంలోనూ రాహుల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయనున్న‌ట్లు ప్రాథ‌మింక‌గా తెలుస్తోంది.

కోడి కత్తి నిందితుడుకు బెయిల్

Tags: Sonia is the only one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *