సోనియా, రాహుల్ కు అండగా నిలవాలి

హైదరాబాద్ ముచ్చట్లు:


ఈడీ పిలిస్తే వెళ్ళాలని కొందరు మాట్లాడడం సిగ్గుచేటు. నరేంద్ర మోడీది నీచ చరిత్ర అని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమతో కలుపుకొని ప్రభుత్వాలని ఏర్పాటు చేయడం దుర్మార్గం. రాహుల్, సోనియాలపై ఈడీ విచారణ కుట్ర పూరితమేని అన్నారు.
మోదీ దుబారా ఖర్చులపై సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు ఎందుకు కళ్లు మూసుకుంటున్నాయి ? మోదీ…నీ మేకిన్ ఇండియా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.పార్టీ సినీయర్ నేత మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికే సోనియా, రాహుల్ పై ఈడీ చర్యలు. సోనియా, రాహుల్ కి ప్రజాస్వామిక వాదులు అండగా ఉండాలి. తప్పుడు కేసులతో కాంగ్రెస్ నేతలను అవమానపరిస్తున్నారు. ఎంతకాలం మా నాయకులను వేదిస్తారో  చేస్తారో అంతకాలం కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడుతూనే ఉంటారని అన్నారు..

 

Tags: Sonia should stand by Rahul

Leave A Reply

Your email address will not be published.