స్థానిక నేతలు చెప్పిందే సోనియా మాట్లాడారు

Sonia spoke to the local leaders

Sonia spoke to the local leaders

Date:24/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
సోనియా గాంధీ సభ ను టీవీ ల్లో,పత్రిక ల్లో చూశాను. ఆమె గద్గద స్వరం తో మాట్లాడారని కొన్ని పత్రికలో రాశారు. .ఆమె స్వరమే అంత. కొత్తగా మారిందేమి లేదు. .సోనియా మేడ్చల్ వచ్చేముందు తెలంగాణ లో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటే బాగుండేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  స్థానిక నేతలు చెప్పిందే సోనియా మాట్లాడారు. .కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణ మాఫీ అని చెప్పి అమలు చేయడం లేదు..ఇక్కడ రుణ మాఫీ చేసినందుకా సోనియా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించేదని ప్రశ్నించారు. నీళ్లు ,నిధులు, నియామకాల గురించి గతం లో చెప్పినట్టే కెసిఆర్ చేస్తున్నారు. .సాగు నీటి ప్రాజెక్టుల పై జాతీయ ,అంతర్జాతీయంగా తెలంగాణ కు ప్రశంసలు వచ్చింది సోనియా కు కనిపించడం లేదా అని నిలదీసారు.  తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడారు. సోనియా కు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇన్ని మేలైన కార్యక్రమాలు చేస్తున్నందుకు బాధ కలిగిందా ? .ఆడబిడ్డలకు మేలు చేసే కల్యాణ లక్ష్మి పథకం చూసి సోనియా బాధ పడ్డదా ? .రైతు బంధు కు ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఇచ్చినందుకా సోనియా బాధ పడిందా ? .మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తున్నందుకా సోనియా కు బాధ ? మేడ్చల్ లో సోనియా నిర్వహించింది ఎన్నికల సభ.
తెలంగాణ వచ్చినందుకు కృతజ్ఞత సభ కు రావడానికి సోనియా నాలుగున్నరేళ్ల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.  సోనియా ఒక్క సభ తో కాంగ్రెస్ నేతలు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. సీఎం కెసిఆర్ ఎన్నికల ప్రచార సభలలో ఒక్క నియోజకవర్గానికి వస్తున్న జనం స్థాయి లో కూడా సోనియా సభకు ప్రజలు రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఈ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని అన్నారు. వంద సీట్లను తెరాస గెలవ బోతోంది. ఎవరూ ఎగతాళి చేసినా డిసెంబర్ 11 న ఈ ఫలితాలే వస్తాయని అన్నారు. ఇపుడు ఏదేదో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు డిసెంబర్ 11 తర్వాత ఎక్కడుంటారో చూడాలి. కోదండరాం అన్ని సీట్లలో పోటీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ కు లొంగి పోయారు. తెలంగాణ జన సమితి ణులు కోదండ రాం ను నిలదీయాలి. నాలుగు ,ఎనిమిది సీట్లు పోటీ చేసిన పార్టీ లు కూడా మేనిఫెస్టో లు విడుదల చేయడం విచిత్రంగా ఉంది. కెసిఆర్ ‘పొరపాటున మహాకూటమి గెలిస్తే ‘అన్న వ్యాఖ్యల పై కాంగ్రెస్ రాక్షాసానందాన్ని పొందుతోందని విమర్శిం,చారు. కెసిఆర్ కుటుంబ పాలన అంటున్న వారు తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఎందుకు ఇచ్చుకున్నారు ? .కెసిఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమాల్లో నుంచి వచ్చి ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. కాంగ్రెస్ 15 సీట్లు గెలిస్తే గొప్పే. .అప్పులు తీర్చే సత్తా ఉన్న వారికే అప్పులు ఇస్తారు. సోనియా నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ అప్పులు తేకుండానే దేశాన్ని పాలించిందా?తెలంగాణ అభివృద్ధి కోసమే అప్పులు తెచ్చామని తలసాని అన్నారు.
Tags:Sonia spoke to the local leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *