సోయి లేకుండా సోనియాపై విమర్శలు

Sonia without criticism

Sonia without criticism

Date:26/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఓ చారిత్రాత్మకం. తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని ప్రజలు స్వతంత్ర పోరాట స్ఫూర్తి తో పోరాడారు. ఉద్యమంలో జర్నలిస్ట్ ల పాత్ర చాలా కీలకం. కానీ కేసీఆర్ జర్నలిస్ట్ లను కూడా మోసం చేశాడని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు అయన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో కేసీఆర్ అంత చీటర్, అబద్దాలకోరు ఎవరు ఉండరు. తెలంగాణ సమాజాన్నంత కేసీఆర్ మోసం చేశాడు. తెలంగాణ ఏర్పాటులో నా వ్యక్తిగత పాత్ర కూడా ఉందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో సోనియా మాట్లాడిన వాళ్లలో నేను ఒకడిని. సోనియా లేకపోతే తెలంగాణ సాధ్యం అయ్యేది కాదు. కేసీఆర్ ఓ దగుల్బాజీ. తెలంగాణ ఇచ్చిన పరిస్థితులను మోడీ కూడా తప్పుబడుతున్న విషయాన్ని ప్రజలు చూస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం ఇప్పుడు కేసీఆర్ కు అత్యంత సన్నిహితమని అన్నారు. దళిత సీఎం తోనే కేసీఆర్ మొదటి మోసం ప్రారంభమైంది. 2014 లో కూడా 65 శాతం ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేశారు. కేసీఆర్ సీఎం కాగానే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. రాజకీయా విలువలను కేసీఆర్ పాతరేశారని విమర్శించారు. అవినీతిలో కేసీఆర్ దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నాడు. ప్రజలు ఉనికి కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. మాట మీద నిలవడాలనే ఇంగితం కేసీఆర్ కు లేదు. తెలంగాణ కాజ్ ముసుగులో కేసీఆర్,కేటీఆర్ లకు అధికార దాహం దాగివుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే, ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారంలో అబద్దాలు చెబుతున్నాడు.
మా ఎన్నికల హామీలను కాపీ కొట్టి, కేసీఆర్ తమ మ్యానిఫెస్టో రూపొందించారని విమర్శించారు. ప్రజా కూటమి అంటే కేసీఆర్ కు ఎందుకు వణుకు పుట్టింది.
మోదీని చూస్తే కేసీఆర్ కు లాగులు తడుస్తాయి. విభజన హామీలను అడగడానికి కేసీఆర్ కు దమ్ములేదు. సోనియా ను విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదు. కేసీఆర్ ఓ బ్రోకర్. తాగి సోయిలేకుండా సోనియాపై విమర్శలు చేస్తున్నాడు. కేసీఆర్ కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదు. కేసీఆర్ దొంగ పాస్ పోర్ట్ లు అమ్ముకునేటప్పుడు నేను మిలటరీలో దేశ సరిహద్దులో పనిచేశాను. కేసీఆర్ బెదిరింపులకు నేను బయపడనని అన్నారు. కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఆరు శాతం కమీషన్ తీసుకున్నాడు. నాకు పిల్లలు లేరు.  రాష్ట్ర ప్రజలే నా పిల్లలు. కేసీఆర్ ఏం చేశారని ప్రజలు ఇప్పుడు ఓటెయ్యాలని అడిగారు. మిషన్ భగీరథ తో ఇంటింటికి నల్లా తో నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగను అన్నాడు. కేసీఆర్ డబ్బుతో ఎన్నికలు గెలవాలని చూస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు .. కేటీఆర్ అమెరికా కు పోవడం ఖాయమని ఉత్తమ్ అన్నారు.
Tags:Sonia without criticism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *