బై ఎలక్షన్స్ లో సన్స్…

Date:23/02/2021

బెంగళూర్ ముచ్చట్లు:

బెళగావి లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ ఉప ఎన్నికలో గెలిచేందుకు రెండు పార్టీలూ అన్ని వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి విజయం సాధించాలన్నది రెండు పార్టీల లక్ష్యంగా ఉంది. బెళగావి లోక్ సభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల కమిషన్ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జేడీఎస్ పోటీలో ఉండబోమని ప్రకటించడంతో ఇక్కడ ద్విముఖ పోటీ జరగనుంది.ఇక్కడ కేంద్ర మంత్రి సురేష‌ అంగడి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణంతో బెళగావి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగుతోంది. అయితే బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. బీజేపీ నుంచి సురేష్ అంగడి కుమార్తె శ్రద్ధా శెట్టర్ కు అవకాశం ఇవ్వాలని దాదాపుగా నిర్ణయం జరిగిపోయినట్లు తెలుస్తోంది.

 

 

 

అయితే ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. బెళగావి ప్రాతంలో సుప్రసిద్ధ వైద్యుడు గిరీశ సోవర్కర్ పేరు కూడా బీజేపీలో విన్పిస్తుంది.శ్రద్ధా శెట్టర్ అయితే సానుభూతి ఉంటుందని బీజేపీలో ఒక వర్గం అభిప్రాయపడుతుంది. అందుకే సురేష్ అంగడి కుమార్తె శ్రద్ధా శెట్టర్ కే టిక్కెట్ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. కానీ ఈసారి ప్రయోగం చేసి చూడాలని మరో వర్గం అభిప్రాయపడుతుంది. అందుకే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ కేంద్ర నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. యడ్యూరప్ప మాత్రం శ్రద్ధా శెట్టర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.ఇక కాంగ్రెస్ విషయానికొస్తే బీజేపీ సిట్టింగ్ సీటు బెళగావిలో పాగా వేయాలని గట్టిగా పోరాడుతుంది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తరచూ అక్కడి నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా అభ్యర్థి ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి సురేష్ జార్ఖిహోళి కుమార్తె ప్రియాంక జార్ఖిహోళి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద బెళగావిలో పాగా వేసేందుకు రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Sons in by-elections …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *