Natyam ad

త్వరలో డీఎస్సీ…

తిరుపతి ముచ్చట్లు:

ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్.. అధికారంలోకి రాగానే ముందుగా మెగా డీఎస్సీ.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు.. ఇస్తామని హామీలు ఇచ్చేశారు.రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయకపోతారా? తమకి ఉద్యోగాలు రాకపోతాయా అని నిరీక్షిస్తున్నారు. లక్షల మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. గ్రూప్ 1 నుండి వీఆర్ఏల వరకూ.. వైద్య విభాగం నుండి పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల వరకూ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది పోస్టులు భర్తీ చేస్తామని జగన్ ఇచ్చిన హామీతో నాలుగేళ్లుగా నిరుద్యోగుల జీవితం పుస్తకాలకే పరిమితమైంది.  జగన్ హామీలు ఇవ్వడం మాత్రమే కాదు.. ఎన్నికల ప్రచార చిత్రాలలో కూడా ఇదే జొప్పించి ప్రజలను మభ్యపెట్టారు.  జగనన్న వస్తాడు.. మాకు ఉద్యోగాలొస్తాయని పదుల కొద్దీ ప్రచార చిత్రాలు నిరుద్యోగుల మీదకి వదిలారు. ఇప్పటికీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవి మన కళ్ళకి కనిపిస్తాయి. కానీ, నాలుగేళ్లలో వచ్చింది వాలంటీర్ ఉద్యోగాలు.. గ్రామ సచివాలయంలో పోస్టులు. అది కూడా వైసీపీ కార్యకర్తలకేనని వాళ్ళే చెప్పుకుంటున్నారు.మెగా డీఎస్సీ అని జగన్ మోహన్ రెడ్డి చెప్పి నాలుగున్నరేళ్లు అయింది. నాలుగేళ్ళ అధికారాన్ని కూడా అనుభవించారు. కానీ, ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఓ సారి జాబ్ క్యాలెండ్ ప్రకటించినా అందులో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు 50కి మించలేదు. అదేమంటే ఓ సారి అనుమతి ఇవ్వలేదంటారు.. మరోసారి జీవో ఇస్తున్నాం అంటారు..

 

 

 

Post Midle

మరోసారి ఏపీపీఎస్సీ రూల్స్ మేరకే చేస్తున్నామని సెలవిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మూడు సార్లు డీఎస్సీ ప్రకటిస్తే ఇప్పుడు జగన్ నాలుగేళ్ళలో ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే డీఎస్సీ ప్రకటించారు. అందులో కూడా యాభై లోపే చెప్పుకోదగ్గ ఉద్యోగాలున్నాయి.  అయితే  ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఓ జిత్తుల మారి  ఎత్తుకు సిద్దమవుతున్నట్లు నిరుద్యోగ వర్గాలలో చర్చ మొదలైంది. త్వరలోనే ప్రభుత్వం భారీ స్థాయిలో డీఎస్సీ ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు చెప్తున్నారు.ఏపీలో ఎన్నికలకు ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ ఖరారైతే ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, నియామకాలు ఉండవు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు తెలియనిదేమీ కాదు. అయినా.. డీఎస్సీ ప్రకటించి మరోసారి నిరుద్యోగులను దగా చేసేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ప్రభుత్వం కొన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను భర్తీ చేయాలని ఏపీపీఎస్సీకి జీవో ఇవ్వాలి. అక్కడ మళ్ళీ చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. నిజంగా భర్తీ చేయాలనుకుంటే ఈ పని ఎప్పుడో చేసేవారు. కానీ, ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే ఎన్నికలకు ముందు ఎందుకు చేస్తున్నారో తెలియనిదేమీ కాదు. ఏపీపీఎస్సీ భర్తీ చేసినా చేయకపోయినా ముందు మేము ప్రకటించామని చెప్పుకోవడమే ప్రభుత్వానికి కావాల్సింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అదే పనిలో ఉన్నట్లు కనిపిస్తున్నది.అలాంటి వారిని ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం ఉతుత్తి జీవోలతో మోసం చేసేందుకు సిద్దమైనట్లు కనిపిస్తుంది.

 

Tags: Soon DSC…

Post Midle