త్వరలో పేదలకు రాగులు, జొన్నలు
విజయవాడ ముచ్చట్లు:
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు రాగులు జోన్నల వంటి పౌష్టికాహారం అందజేయనున్నట్లు పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూలరి వెంకటేశ్వరరావు తెలిపారు.గురువారం బందర్ రోడ్ లోని పౌర సరఫరా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు మినరల్స్ తో కూడిన బియ్యాన్ని అందజేయనున్నట్లు అదేవిధంగా రాగులు జొన్నలు వంటి చిరుధాన్యాలను రాయల సీమలో ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా రాగులు జొన్నలు త్వరలో ఇస్తామని తెలిపారు. పౌష్టికాహారంతో కూడిన బియ్యాన్ని అందజేస్తుంటే ఓ ఓర్వలేని ప్రతిపక్షాలు కల్తీ బియ్యంగా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాగులు జొన్నలు పంటలు వేయటానికి అవసరమైతే రైతులకు సహాయం చేస్తామని అన్నారు. రైతుల దగ్గరకి ఎంఎస్పి విధానం ద్వారా కొంటామని అన్నారు. ధాన్యం కొన్న ఐదు రోజుల్లో రైతులకు డబ్బులు అందజేస్తామని అన్నారు.రేషన్ దుకాణాల ద్వారా ప్లాస్టిక్ బియ్యం అందజేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని అన్నారు. వాస్తవానికి మినరల్స్ తో కూడిన బియ్యాన్ని మామూలు బియ్యంతో కలుపుతామని అన్నారు.వంద బిజెపి గింజలకు మినరల్స్ తో కూడిన గింజ వస్తుందని అన్నారు ఇది గర్భిణీ స్త్రీలలో పిల్లలు రక్తహీనతను నివారిస్తుందని తెలిపారు.

Tags: Soon ragi and sorghum for the poor
