పాలనపై త్వరలో శ్వేతపత్రం

Soon white paper on governance

Soon white paper on governance

Date:14/12/2019

విజయవాడ ముచ్చట్లు:

రాష్ట్రంలో వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల పాలనకాలంలో ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నిరవేర్చాం. జనవరి 9 న ప్రవేశ పెట్టనున్న అమ్మఒడి పథకంతో అన్ని హామీలు పూర్తి అవుతాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పాలనలో శాసనసభ సమావేశాలలో ఎన్నిక హామీలు, ప్రజల గురించి చర్చించ లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక గత శాసనసభ సమావేశాల్లో19 బిల్లు ఆమోదం పొందాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. చంద్రబాబు నాయుడు 5 రోజుల శాసనసభ సమావేశాలను స్తంభింప చేయాలి చూశారని విమర్శించారు.
సంక్షేమ ఫలాలు ప్రజలకు చెరకుండా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కి ప్రజలు ఇచ్చిన 151 సీట్ల ప్రజా తీర్పును చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు. దిశ చట్టం పై చర్చ జరగాలంటే ఉల్లి గురించి రాద్దాంతం చేయా లని చూసారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఉల్లి కొరత తీర్చేలా చర్యలు చేపట్టారు. కేజీ ఉల్లి 25 రూపాయలకే అందుబాటులో ఉంచారు. ఇంగ్లీషు విద్య, అమ్మఒడి, నాడు నేడు,రివర్స్ టెండరింగ్.. అన్నింటిలోను చంద్రబాబు అడ్డుపడుతున్నారు.

 

 

 

 

 

 

 

ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం చూస్తుంటే చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉన్మాది, బస్టర్డ్  అంటూ చంద్రబాబు విచక్షణ కోల్పోతున్నారు. అసెంబ్లీలో ప్రతి పక్షం తీరు జుగుప్స కలుగుతుంది. చంద్రబాబుపాలనలో ప్రజాస్వామ్య న్ని,రాజ్యాంగ విధానాలను కూని చేశారు. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు ప్రవర్తన లో మార్పు లేదు. సంక్షేమ కార్యక్రయాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకుపెద్ద పీఠ వేస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పుల తెచ్చామని అన్నారు. నాడు నేడు కార్యక్రమంతో రాష్టంలో పాఠశాలకు3500 కోట్లు తో మొళిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రజలు కోరుకునే పరిపాలన జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో చంద్రబాబు ప్రవర్తన భయానకంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో నిలిచి పోయే చట్టం దిశ చట్టమని అంబటి అన్నారు. శాసనసభ లోదిశ బిల్లు ప్రవేశ పెట్టే టప్పుడు చంద్రబాబు అండ్ కంపెనీ బయటకు వెళ్లి పోయింది. డిసెంబర్21 జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్స వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. గత ప్రభుత్వం హయాంలో పాలన అవినీతి కంపుగా మారింది. 7 నెలల పాలనపై త్వరలో శ్వేత పత్రం సైతం విడుదల చేస్తామని అన్నారు.

 

వైసిపి పాలనలో రైతులు సుభిక్షం

 

Tags:Soon white paper on governance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *