Natyam ad

పాపం… ఆలీ

గుంటూరు ముచ్చట్లు:


అసలు దురదంటూ రాకూడదు కానీ, వచ్చిందంటే ఇక అంతే, గోక్కుంటూనే ఉండాలి…ఆ దురద రాజకీయ దురదయితే, ఇక చెప్పనే అక్కరలేదు. కంటికి కనిపించకుండా అలా గోకుతూ…నే ఉంటుంది. పొరుగువాడిని పట్టుకుని మరీ  గోకమంటుంది. నువ్వు గోకినా గోకక పోయినా నేను మాత్రం గోకుతూనే ఉంటానంటూ వెంటపడి మరీ గోకుతుంది.  లేదు, లేదు మీరు పొరపడుతున్నారు, ఈ గోకుడుకు ఆ గోకుడుకు అసలు సంబంధమే లేదు. నో రిలేషన్, ఎటాల్ ఐ సే .. సంబంధమే లేదు అన్నమాట. నేను మాట్లాడుతున్నది, కేసీఆర్ సార్ వినిపించిన గోకుడు పురాణంలోని గోకుడోపఖ్యానం గురించి కానే కాదు. ఇదంతా మా ఆలీ గోకుడు గోల, ఎస్.. అవును.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది సరదాగా అలీతో .. కూర్చి… గురింఛి అన్నమాట. ఎస్…కమెడియన్ ఆలీకి ఎప్పడు ఎక్కడ ఎలా తగిలిందో ఏమో కానీ, రాజకీయ దురద గుంటాకు, ఒళ్లంతా తాకేసింది. ఇక అక్కడ నుంచి ఆలీని రాజకీయం రాజకీయాలను ఆలీ గోకుతూనే ఉన్నారు. అయితే, అదేమిటో కానీ, ఆలీ సినిమాల్లోనే కాదు,

 

 

 

రాజకీయాల్లోనూ కమెడియన్’ గానే మిగిలి పోయారు. పాపం … ఫర్ ది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్, పోలిటికల్ ఎంట్రీ కోసం … కనిపించిన వారందరినీ గోకుతూనే ఉన్నారు. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు , ఆయన  ఓకే ఈసారి.. ముగ్గురు నాయకులను గోకారు .. మూడు పార్టీలలో చేరి పోయినంత పనిచేశారు. ఓ ఫైన్ మార్నింగ్ ఆయన పొద్దుగాల, పొద్దుగాల  లేస్తూనే… పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత  జగన్ రెడ్డి  తలుపు తట్టారు. సో ..న్యాచురల్లీ ఆయన వైసీపీలో చేరిపోతున్నారని స్ర్కోలింగ్ లు పరుగులు తీశాయి. ముహూర్తం, వేదిక ఎవ్రీథింగ్ ఫిక్స్ అయి పోయాయి. బట్ ..ద వెరీ నెక్స్ట్ డే .. అలీ కామెడీగా అమరావతిలో వాలిపోయారు, ఎక్కడేమిటి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో .. ఆయనతో ఓ గంటో రెండు గంటలో భేటీ జరిపి బయట కొచ్చారు .. ఆతర్వాత టీవీ స్ర్కోలింగ్గ్స్ ఫాలో అయ్యాయి. అయితే .. అంతే కాదు .. అంతే అయితే అందులో ‘పంచ్’  ఏముందని పవన్ కళ్యాణ్ ఇంటి కెళ్ళారు.మిగిలిన కథంతా సేమ్.. టూ…

 

 

Post Midle

సేమ్.. అదేదో సినిమాలో బండి మీద ఇసుక మూట పెట్టుకుని బోర్డర్ దాటేస్తాడు చూడండి .. కామెడిగా అలాగన్న మాట.. అయితే చివరకు ఆయన, ఆ ఎన్నికల్లొ పోటీ అయితే చేయలేదు కానీ, వైసీపీ తరపున ప్రచారం చేశారు. ఇక అక్కడి నుంచి చకోర పక్షిలా ఏదో ఒక పదవి వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నారు.. జగనన్న పదవి ఇవ్వక పోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్యనో మారు జగనన్న పిలిచారని, కొత్త బట్ట లేసుకుని తాడేపల్లి ప్యాలెస్ లో వాలి పోయారు అలీ. ముఖ్యమంత్రిని కలిశారు.ఆతర్వాత మీడియా ముందు కొచ్చిన అలీ, ముసి ముసిగా మురిపెంగా నవ్వుతూ,  “ఈ రోజు రమ్మని పిలిచారు. వచ్చాను. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని  కలిశాను, అతి త్వరలోనే పార్టీ ఆఫీసు నుంచి శుభవార్త వస్తుందని తెలిపారు. ఏ పదవి ఇస్తారన్నది మాత్రం చెప్పలేదని’ ఆనందంలో ఉబ్బితబ్బిబయ్యారు. సిగ్గులొలక పోశారు. రాజ్యసభ టికెట్ మొదలు వక్స్ బోర్డు చైర్మన్’ వరకు ఏదో ఒక పదవి వస్తుందని,ఆయన ఎదరుచూస్తున్నారు. పదవుల పందేరం అయిపొయింది, రాజ్య సభ టికెట్ పక్క రాష్ట్రానికి చెందిన బీసీ నేత ఆర్. కృష్ణయ్యకు ఇచ్చారు కానీ, అలీకి మాత్రం శుభ వార్త రాలేదు. గతంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రుద్వీరాజ్ కూడా ఇలాగే, జగన్ రెడ్డి మీద చాలా ఆశలు పెట్టుకుని అటూ ఇటూ కాకుండా పొయారు ..  ఎంద చాట.. కాట్రవల్లి .. అంతేనా అలీ .

 

Tags: Sorry… Ally

Post Midle