లిక్కర్ స్కామ్ లో తెలుగు రాష్ట్రాలలో మూలాలు

విశాఖపట్నం ముచ్చట్లు:


లిక్కర్ స్కామ్‌ పై ఢిల్లోలో డొంక కదిలితే ఆంధ్రా , తెలంగాణా లో మూలాలు వెలుగు చూస్తున్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.రెండు రాష్ట్రాల్లో అధికారపార్టీకి సంబంధాలు వున్నట్లు తెలుస్తోందన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో నిబంధనలు తుంగలోకి తొక్కరని ఢిల్లీ చీఫ్ విజిలెన్స్ విభాగం నిర్ధారించిందని, ఢిల్లీ ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని జీవీఎల్ అన్నారు.ఎంతో విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు కేవలం 500 కోట్లకే ఒక ప్రైవేటు సంస్ధ చేజెక్కించుకుందంటే ఎంత దారుణమని జీవీఎల్ అన్నారు.  జగన్ సర్కార్ స్పందించదా అని ప్రశ్నించారు. భూములను ఏ పర్పస్ కోసం ఇచ్చారన్నారు. ల్యాండ్ అగ్రిమెంట్‌పై జరిగిన అంశాలు తెలపాలని డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే కొడుకు సదరు సంస్ధలో డైరెక్టర్‌గా వున్నారని, వారికి ఉండే ఆసక్తి ఏంటో ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. విశాఖలో పెద్ద సంఖ్యలో ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆంధ్రేతర ప్రాంతానికి చెందిన ఓటర్లను కావాలని 50 వేలు మందిని జాబితాలోంచి తొలగించారన్నారు. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖరాయడం జరిగిందని జీవీఎల్ పేర్కొన్నారు.

 

Tags: Sources in Telugu states in liquor scam

Leave A Reply

Your email address will not be published.