South Savale to Modi

South Savale to Modi

-ఒక్కటవుతున్న మళ్లీ ప్రాంతీయ నేతలు

Date:05/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

దేశంలో మోడీ ఎదురులేని నాయకుడుగా ఉన్నారు. ఆయన రెండవమారు గెలిచిన తరువాత ప్రతిపక్షం ఎక్కడా కిక్కురుమనడంలేదు. టీవీ సీరియల్ మాదిరిగా రాజకీయ కర్ణాటకం ఆడినా కూడా ఎవరూ నోరు విప్పలేకపోయారు. కుమార విలాపాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఏడాదికి ముందు గొప్పగా కిరీటం తొడిగిన వారే ఇపుడు సైలెంట్ గా సైడ్ అయిపోయారు. మరి ఎవరి రాజకీయ అవసరాలు వారివి. ఎందుకొచ్చిన మోడీతో గొడవ అని సర్దుకుంటున్న పరిస్థితి. ఇక బీజేపీ తీరు చూస్తే దేశమంతా జయించినా కూడా దక్షిణాది కసిగా వెక్కిరిస్తోంది. తమిళనాడు, కేరళతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలూ మోడీ గాలిని ఆపేసి మరీ షాక్ ఇచ్చేశాయి.

 

 

 

 

కర్నాటకలో మళ్ళీ బీజేపీని గద్దెనెక్కింత సులువు కాదు మిగిలిన నాలుగు రాష్ట్రాల‌లో పాగా వేయడం. అందుకే మోడీ తనదైన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.ఇక మోడీకి ఉత్తరాది సరెండర్ అయింది. పశ్చిమ రాష్ట్రాలూ పాదాక్రాంతం అయ్యాయి. ఈశాన్యం కూడా సాహో అనేసింది. ఒక్క సౌత్ మాత్రమే చిక్కనంటోంది. ఇక్కడే అసలైన ప్రతిఘటన మోడీకి ఉందన్నమాట. ఓ విధంగా చెప్పాలంటే మోడీ ప్రాభవాన్ని, పరాజయాన్ని డిసైడ్ చేసేవి ఈ నాలుగు రాష్ట్రాలే. బీజేపీ యావ చూస్తే చాలా ఎక్కువగానే ఉంది. ఏదో విధంగా పాగా వేయాలన్న కుతూహలంతో కదం తొక్కుతోంది.

 

 

 

 

ఈ పరిణామాల క్రమంలో ఉత్తరాది నాయకులు, జాతీయ విపక్ష రాజకీయం కనుమరుగు అవుతూంటే సౌత్ నుంచే మోడీని ఢీ కొట్టే కొత్త జట్టు పుట్టుకువస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బయట‌కు మోడీతో ఎటువంటి కయ్యం పెట్టుకోకపోయినా లోపల మాత్రం కుతకులాడుతున్నారు. తమ మీదకు దూసుకువస్తున్న మోడీని ఆపేందుకు ఇద్దరూ ఒక్కటిగా చేతులు కలుపుతున్నారు.నిజానికి ఆరు నెలల క్రితం వరకూ మోడీ, కేసీఆర్, జగన్ ఒకే గూటి పక్షులుగా ఉండేవారు. ఎపుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో రెండవమారు గెలిచి పీఠమెక్కారో నాటి నుంచి కేసీయార్ ఢిల్లీ వైపు చూపు నిలిపారు. ఫెడరల్ ఫ్రంట్ అని హడావిడి చేశారు. జగన్ సైతం కేసీఆర్ తో దోస్తీ కట్టడం మోడీకి చికాకు పెట్టింది.

 

 

 

 

దీంతో తాను మళ్ళీ ప్రధాని కాగానే అటు జగన్, ఇటు కేసీయార్ ఇద్దరి మీద కత్తులు నూరడం మోడీ ఆరంభించారు. ఏపీలో జగన్ కి ఏ మాత్రం సాయపడకుండా అష్ట దిగ్బంధనం చేసి ఆయనకు జై కొట్టిన జనాలతోనే నై అనిపించాలన్నది మోడీ ఎత్తుగడ. ఇక కేసీఆర్ ను, టీఆర్ఎస్ ని ముప్పతిప్పలు పెట్టి 2023 నాటికి తెలంగాణాలో పాగా వేయాలన్నది మరో పధకం. దీన్ని గమనించిన జగన్, కేసీఆర్ మరింత దగ్గరవుతున్నారు. తమ అస్థిత్వం కాపాడుకోవడానికి మునుపెన్నడూ లేని విధంగా ఒక్కటిగా కలసి అడుగులు వేస్తున్నారు.

 

 

 

 

ఇక తమిళనాడులోని డీఎంకే స్టాలిన్ తోనూ వీరికి సాన్నిహిత్యం ఉంది 2021లో అక్కడ స్టాలిన్ గెలిస్తే మోడీ వ్యతిరేక కూటమి సౌత్ నుంచే మొదలవుతుంది. కేరళలో వామపక్షాలు కూడా తోడు అయితే దక్షిణాడి మోడీకి పెను సవాలే విసురుతుంది. దానికి నాందిగానే ఇద్దరు తెలుగు సీఎంలు తరచూ భేటీలు అవుతూ భవిష్యత్తు రాజకీయ చిత్రాన్ని తమకు అనుకూలంగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నారని అంటున్నారు.

కుటుంబ ముద్ర పొగొట్టుకొనే ప్రయత్నం లో కుమార

 

Tags: South Savale to Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *