కేరళలోకి నైరుతి రుతుపవనాలు

Date:01/06/2020

తిరువనంతపురం ముచ్చట్లు:

వాతావరణ శాఖ చల్లని కబురు అందించింంది. నైరుతి రుతుపవనాలు సోమవారం దేశంలోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు కేరళలో తీరాన్ని తాకాయని, మరో 12 గంటల్లో ఆరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది బరింత బలపడి తుఫానుగా మారుతుందని పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రాంతాల వారీగా ఈ ఏడాది వర్షపాతం అంచనాలను వెల్లడించనుంది.‘గత రెండు రోజులుగా కేరళలోని వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఆగమనానికి సంబంధించి గత 48 గంటల్లో మొత్తం 14 వర్షపాత పర్యవేక్షణ కేంద్రాల్లో 70 శాతం కంటే ఎక్కువ చోట్ల వర్షపాతం నమోదయ్యింది. పశ్చిమ గాలులు దిగువ స్థాయిలలో (20 నాట్ల వరకు గాలి వేగం) బలపడి, దక్షిణ అరేబియా సముద్రంలో 4.5 కిలోమీటర్ల వరకు ఉన్నాయని’ ఐఎండీ తెలిపింది.

 

 

 

 

మే 27 నుంచి ఉపగ్రహ చిత్రాలు, తీర ప్రాంతంలోని డాప్లర్ వెదర్ రాడార్ల నుంచి పొందిన సమాచారం ప్రకారం అవుట్‌గోయింగ్ లాంగ్‌వేవ్ రేడియేషన్ విలువలు 200 డబ్ల్యూఎంగా సూచించిందని, ఇవి రుతుపవనాల రాకు సంకేతమని పేర్కొంది.దేశంలో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. భారత్‌లో వ్యవసాయానికి నైరుతి రుతుపవనాలే కీలకం. దాదాపు 80 శాతం భూభాగం దీనిపైనే ఆధారపడింది. దేశంలోకి ఈ ఏడాది రుతుపవనాలు కొంత ఆలస్యంగా ప్రవేశించనున్నాయని మే 15న భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనుండగా.. ఈ ఏడాది మాత్రం జూన్ 5కి నాలుగు రోజుల ముందు లేదా వెనుక తాకుతాయని పేర్కొంది. అయితే, ఇప్పుడు అనుకున్న సమయానికే నైరుతి వచ్చింది.

అమెరికాలో పెట్రేగుతున్న హింస

Tags: Southwest Monsoon Into Kerala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *