ఒకటి రెండు రోజుల్లో అండమాన్ కు నైరుతి రుతుపవనాలు

Date:18/05/2019

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలుతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్ని తాకేందుకు అనువైన వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శని, ఆదివారాల్లో ఇవి అక్కడి దక్షిణాది ప్రాంతాలను తాకే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం కర్నూలులో గరిష్ఠంగా 42.9 డిగ్రీలు, తిరుపతిలో 42.8, అనంతపురంలో 42.8, కడపలో 42.0, నెల్లూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలులు వీచే సమయంలో ఎవరూ బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు కోస్తాంధ్రలో వడగాలులు తప్పవని, దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

 

 

22న పార్టీ నేతలు..23న ప్రతిపక్షాలతో సోనియా భేటీ

 

Tags; Southwest Monsoon to Andaman in one day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *