రిమ్స్ పోలీసుస్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ కె కె అన్బురాజన్
కడప ముచ్చట్లు:
కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బు రాజన్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరిసరాలను పరిశీలించారు. ఆవరణలో పచ్చదనం పెంపొందించాలని, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని రిమ్స్ సి.ఐ సదాశివయ్య ను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు..
అనంతరం పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. దొంగతనాలు అరికట్టేందుకు గస్తీ ముమ్మరం చేయాలని, నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా, నిషేధిత గుట్కా పై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు మహిళల భద్రత కు పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘దిశ’ యాప్ పై అవగాహన కల్పించి డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్టర్డ్ యూజర్ గా నమోదు చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకువ చ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు.ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రిమ్స్ సి.ఐ సదాశివయ్య కు సూచించారు.
Tags:SP KK Anburajan inspecting Rims Police Station

