అల్లర్లు చేస్తే అణచివేస్తా – ఎస్పీ మణికంఠ చందవోలు హెచ్చరిక

-144 సెక్షన్‌ అమల్లో ఉంది

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల కౌంటింగ్‌ పక్రియలో గాని, తరువాత గాని ఎలాంటి అల్లర్లు సృష్టించిన అణచివేస్తానని అల్లరిమూకలకు ఎస్పీ మణికంఠ చందవోలు స్టాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. శనివారం పట్టణ పురవీధులలో మాబ్‌ ఆపరేషన్‌ను సాయూద దళాల పోలీసులతో నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధులలో ఖవాతు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ పక్రియ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. కౌంటింగ్‌ సమయంలో గానీ, తరువాత గాని ఎక్కడ అల్లర్లు సృష్టించిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, దాడులు చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడితే పోలీస్‌ తడాఖా చూపిస్తామన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ పక్రియను సజావుగా నిర్వహించుకునేందుకు సహకరించాలన్నారు. గెలిచిన, ఓడిన గ్రామాల్లో రెచ్చగొట్టె చర్యలు ఎవరు చేపట్టరాదని హెచ్చరించారు. కౌంటింగ్‌ పక్రియతో పాటు అన్ని గ్రామాలు, పట్టణాలలో పకడ్భంధిగా సమాచారాన్ని సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎలాంటి సమస్యలు ఎదురైన తక్షణం తమకు తెలియజేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా ర్యాలీలు, విజయోత్సవ సభలను రద్దు చేయడం జరిగిందన్నారు. ముందు జాగ్రత్తగా 144 సెక్షన్‌ అమలులో కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో ప్రజాజీవనం స్తంభించకుండ ఎన్నికలను స్నేహపూర్వక రీతిలో తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎఆర్‌ అడిషినల్‌ ఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ రఘువీరప్రసాద్‌, సీఐ రాఘవరెడ్డి , పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:SP Manikantha Chandavolu warns if there is rioting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *