ఎస్పీ కమిషన్ కార్యాలయం ప్రారంభం

SP office commences

SP office commences

Date:18/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
ఉమ్మడి రాష్ట్రంలో  ఎస్సీ ఎస్టీ  కమిషన్ ఉందా అని డౌట్ ఉండే కానీ ఇప్పుడు దీనికి ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి  కమిషన్ కు  ఇంత పెద్ద కార్యాలయం ఇవ్వడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విదంగా ఈ కమిషన్  పనిచేస్తుందని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. బుధవారం నాడు పరిశ్రమల భవన్ లో ఎస్సి,ఎస్టీ కమిషన్  నూతన కార్యాలయాన్ని మంత్రలు ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి   శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి హరీష్ రావు, ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,  ప్రభుత్వ విప్ పాతురి సుధాకర్ రెడ్డి, ఆర్టీఐ చీఫ్ కమిషనర్ రాజాస దారం, బీసీ కమిషన్ చెర్మన్ రాములు, వివిధ కార్పొరేషన్ ల చెర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గోన్నారు.  మంత్రి నాయిని మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ వస్తే వారికి పరిపాలించుకొనే స్తోమత ఉందా అని వారు కానీ వాటి అన్నింటినీ అధిగమించి ముందుకు పోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి  అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాతోపాటు ఉద్యమంలో పని చేసిన వ్యక్తి.  అప్పుడు విద్యార్థి నాయకుడు గా , తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడు గా పార్టీ కి సేవ చేస్తూ వస్తున్నాడని అన్నారు. మా హోమ్ శాఖ తరుపున అన్ని విధాల సహకరిస్తాం. ఎస్సి ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందు ఉంటున్నాడు మా ఎర్రోళ్ల శ్రీనివాస్ అని అన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను ఎస్సి ఎస్టీ చైర్మన్ గా నియమించినందుకు చాలా సంతోషం. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఎర్రోళ్ల శ్రీనివాస్. ఎస్సి ఎస్టీలలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడే వ్యక్తి ఎర్రోళ్ల శ్రీనివాస్ అని అన్నారు. ఎస్సి ఎస్టీ కమిషన్  చైర్మన్ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 2003 లో ఏర్పాటు చేసిన ఈ ఎస్సి ఎస్టీ కమిషన్ ఎక్కడ కూడా పని చెయ్యలేదు. అప్పట్లో సమైక్యవాదులకు మాత్రమే కమిషన్ లో చోటు కల్పించారు. అప్పుడు ఒక్క పోస్ట్ లో మాత్రమే మన తెలంగాణ వారిని నియమించారు. అప్పుడు అడుగడునా అన్యాయం జరిగిందని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలని అన్నారు.కమిషన్ ఏర్పాటు చేసి దళితులకు జరుగుతున్న అన్యాయం పై కమిషన్ ముందుంటుంది. సీఎం కేసీఆర్ మాపై నమ్మకం తో ఈ పదవులు ఇచ్చారు వారు మాకు ఏ నమ్మకంతో పదవులు కట్టబెట్టారో అంతే నమ్మకంతో పని చేస్తామన్నారు. కార్పొరేట్ ఆఫీస్ తరహాల మా ఆఫీస్ ను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఎక్కడా దళితులకు అన్యాయం మా ఆఫీస్ ను నేరుగా సంప్రదించవచ్చు.మాకు పోన్ చేసిన మేము స్పందిస్తాం. 60 యేండ్లలో చెయ్యని ఎస్సి ఎస్టీ కమిషన్ 4 నెలల్లో చేసి చూపించాం. ఎస్సి ఎస్టీ లకు ఎక్కడ ఎం జరిగిన మీకు మేము అండగా ఉంటాం ధైర్యంగా రాండి ఇది మా ఆఫీస్ కాదు మన ఆఫీసని అయన అన్నారు.
ఎస్పీ కమిషన్ కార్యాలయం ప్రారంభం https://www.telugumuchatlu.com/sp-office-commences/
Tags:SP office commences

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *