పిన్న వయసులో ఉన్నత ఆశయాలు ఎస్పీ రిషాంత్
– చిత్తూరు ఎస్పీ పై బాబు అండ్‌కో దాడిఎందుకు
-కాల్పులు జరిపి ఉంటే బలైయ్యేది పచ్చమూకలే
– వివేకం లేని బాబు మాటలు
-ఎస్పీకి పలువురి ప్రశంసలు
-పోలీసులకు అండగా జనం
పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర చరిత్రలో ఎక్కడాలేని విధంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై వ్యూహం ప్రకారం ఈనెల 4న పుంగనూరులో పచ్చ మూకలు దాడి చేసి సుమారు 50 మంది పోలీస్ అధికారులను, సిబ్బందిని తీవ్రంగా గాయపరచిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రేరేపిత మాటలకు పచ్చమూకలు రెచ్చిపోవడం రుజువైంది. కానీ ఇలాంటి సమయంలో పోలీసులు ప్రాణాలు పణంగా పెట్టి విధి నిర్వహణలో పాల్గొన్నారు. పరిస్థితి అదుపుతప్పిందని పలమనేరు డిఎస్పి సుధాకర్‌రెడ్డి ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డికి సమాచారం అందించారు. కానీ పిన్న వయసు కలిగిన ఎస్పీ తన విచక్షణాధికారాలను ఉపయోగించకుండ , సంఘటన తీవ్రతను గమనించి, పోలీసులు ఒక అడుగు వెనక్కు వేసిన తప్పులేదు…శాంతికి విఘాతం కలగరాదు….కాల్పులతో అమాయకులు బలికారాదన్న ఉన్నత ఆలోచనలతో కాల్ఫులకు అనుమతించలేదు. ఎస్పీ ఉన్నత ఆలోచనలు, ఆశయాలు పచ్చమూకల ప్రాణాలను కాపాడి, పచ్చ కుటుంబాలను వీధిన పడకుండ చేసింది.
ఈ సంఘటన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు సానుభూతి వ్యక్తమౌతోంది. ఉన్నత విలువలు, ఆలోచనలు కలిగి, బాధ్యతతో జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని నడిపిస్తున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి సంయమనం, వివేకానికి విలువ కట్టలేకపోతున్నారు. ఎస్పీ పోలీసులకు అండగా నిలుస్తూ , మరో వైపు గాయపడిన వారిని పరామర్శిస్తూ , పరిస్థితిని సమీక్షిస్తూ, శాంతిని నెలకొల్పేందుకు, కాల్పులకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన పనితీరును మేదావి వర్గం హర్షిస్తోంది. కానీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అనుచరులు మాత్రం జిల్లా ఎస్పీని టార్గెట్‌గా చేసి తీవ్రంగా విమర్శిస్తూ , పోలీసులు మనోధైర్యం దెబ్బతీస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు నిజాయితీతో ఈ సంఘటనను పునఃపరిశీలించుకుని వాస్తవాలు మాట్లాడి , పోలీసులకు మనోధైర్యం కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. నీచ రాజకీయాలకు పోలీస్ శాఖను బలిపశువులను చేయవద్దని మేదావివర్గం బాబు అండ్‌కోకు సలహా ఇస్తోంది.
Tags: SP Rishant had high ambitions at a young age
