Natyam ad

సైకిల్ యాత్రలో స్పీకర్ పోచారం

బాన్స్ వాడ ముచ్చట్లు:


స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా “హైదరాబాద్ సైకిల్ గ్రూప్” చేపట్టిన “తిరంగా సైకిల్ యాత్రను”  తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి అభినందించారు. హైదరాబాద్ సైకిల్ గ్రూప్ సభ్యులు 350 మంది స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కుత్బుల్లాపూర్ నుండి 100 కిలో మీటర్ల సైకిల్ యాత్రను హైదరాబాద్౼నాగపూర్ జాతీయ రహదారిపై (NH-44) పై  చేపట్టారు. ఆదివారం  ఉదయం హైదరాబాద్ నుండి బాన్సువాడ కు వెళ్ళుతున్న స్పీకర్ పోచారం  మెదక్ జిల్లా చేగుంట సమీపంలో ఈ సైకిల్ యాత్ర చూసి ఆగి వారిని కలిసి మాట్లాడారు..
ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశ ప్రజలు తమ స్వంత పండుగలా జరుపుకుంటున్నారు. ఇది ఏ కులానికో, మతానికో, ప్రాంతానికో సంబంధించినది కాదు. 140 కోట్ల మంది భారతీయుల పండుగ. మేము కూడా భారతీయులమే అనే దేశభక్తితో ఈ యాత్రను చేపట్టిన సైకిల్ గ్రూప్ సభ్యులకు ప్రత్యేకంగా నా అభినందనలని అన్నారు.

 

Tags: Speaker Pocharam on a cycle trip

Post Midle
Post Midle