కోటప్ప కొండలో స్పీకర్ పర్యటన

Speaker tour in Kotappa Hill
Date:08/11/2018
గుంటూరు ముచ్చట్లు:
సోమవారం నాడు జిల్లాలోని కో టప్పకొండలో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పర్యటించారు. చెరువు, టూరిజం కాంప్లెక్స్, యాంపి దియేటర్, వ్యూ పాయింట్, ఆక్వేరియం, వన విహరి, జింకల పార్క్  అభివృద్ధి పనులు పరిశీలించారు. తరువాత  కార్తీకమాసం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసి త్రికోట్వేశ్వరుని దర్శించుకున్నారు. తరువాత అయన గిరి ప్రదక్షిణ ప్రాంతాన్ని అటవీ, ఎండోమెంట్ కలసి అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు. కోటప్పకొండ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ను ఏర్పాటు చేయాలని అన్నారు. 2019నాటికి 15కోట్లు ఆదాయం వచ్చే విధంగా సదుపాయాలు కల్పించాలని అన్నారు. హిల్ ఫెస్టివల్ నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అన్నారు. కోటప్పకొండపై అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి క్వాలిటీ, నిత్యం యాగాలు, యగ్నాలు, హోమాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. బక్తులు ఎంతమంది వచ్చినా నిత్యం అన్నదానం కార్యక్రమం కోనసాగుతుందని అయన అన్నారు. 30మందితో ప్రారంభమైన అన్నదానం కార్యక్రమం నేడు 5వందలు అంతకన్న ఎక్కువ మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. తలనీలాలకి ప్రత్యేక సిస్టమ్ ఉంటే విధంగా చర్యలు తీసుకోవాలి. కుటుంబంలో ఎవ్వరైనా చనిపోతే నిద్ర చేయడానికి వచ్చే వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఇండియాలోనే రికార్డు స్టాయిలో ఉండే విధంగా 63అడుగుల వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని అయన అన్నారు.
Tags: Speaker tour in Kotappa Hill

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *