పుణ్యక్షేత్రంలో రాజకీయాలు మాట్లాడటం విడ్డూరం,విచారకరం

విజయవాడ ముచ్చట్లు:

 

నగరి శాసనసభ్యులు రోజా ఈ రోజు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో దర్శనానికి వచ్చిన తర్వాత రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ విమర్శలు చేయడం పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్రతని అపవిత్రం చేయడమే అవుతుందని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పి.సప్తగిరి ప్రసాద్ విమర్శించారు.
తిరుమల క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ విమర్శలు చేయకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ కూడా వచ్చిన ప్రతిసారీ ఈ విధంగా రాజకీయ విమర్శలు చేసి కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడం అవుతుంది ! .దేవినేని ఉమ గారిని లోకేష్ బాబు గారిని చంద్రబాబుగారు పైన వ్యక్తిగత విమర్శలు చేసి తిరుమల క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చడం రోజాగారికి  సర్వసాధారణమైపోయింది!  .రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరీమణి అయిన షర్మిల స్వయానా తన రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే భోజనాలు తినడానికి, మిఠాయిలు పిలిపించుకోవడానికి సమయం ఉంటుంది! కానీ కృష్ణా జలాలపై   రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోవడానికే సమయం లేదా? అని  షర్మిల ప్రశ్నించినట్టు వంటి ప్రశ్నకి రోజా గారు ఏం సమాధానం చెబుతారని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సూటిగా ప్రశ్నిస్తున్నాము?  తిరుమల క్షేత్రంలో రాజకీయ  విడ్డూరం విచారకరమని అన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags; Speaking of politics in the shrine is ridiculous and doomed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *