కనీస సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి- మంత్రి కేటీఆర్ పురపాలకంపై ఉమ్మడి ఖమ్మం జిలా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష. ముఖ్య అతిధులుగా హాజరైన మంత్రులు కేటీఆర్, అజయ్

Date:30/07/2020

 

హైదరాబాద్ ముచ్చట్లు:

పురపాలక సంఘాల పరిధిలో పట్టణాల్లో రోడ్లు, త్రాగునీరు, పారిశుధ్యం వంటి కనీస అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  దిశానిర్దేశం చేశారు. గురువారం హైదరాబాద్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్  సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించాల్సిన పనులు, కొనసాగుతున్న పలు మున్సిపాలిటీల అభివృద్ధికి, చేయాల్సిన పనులపై అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. ప్రజలు ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని వివరించారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను  కచ్చితంగా అమలు జరపాలని మంత్రి ఆదేశించారు.సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, జిల్లా కలెక్టర్లు ఆర్వీ కర్ణన్,  ఎంవి రెడ్డి, ఖమ్మం మేయర్ పాపాలాల్,  ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకట వీరయ్య, , కందాల ఉపేందర్ రెడ్డి,  బానోతు హరిప్రియ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ , ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ,  ఖమ్ముం మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి , అదనపు కలెక్టర్ స్నేహాలత , మున్సిపల్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 కోవిడ్ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలి

Tags:Special attention should be paid to minimum facilities- Minister KTR
Review with the Joint Khammam District Officials and Representatives on the Municipality.
Ministers KTR and Ajay were the chief guests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *