-ఐసిడిఎస్ సూపర్వైజర్ నిర్మల
Date:23/02/2021
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
చిన్నారుల సంక్షేమంపై అంగన్వాడి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని వేములవాడ ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మలా అన్నారు, వేములవాడ పట్టణంలో సుభాష్ న గర్, సుబ్రహ్మణ్యం నగర్ అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ నిర్మలా ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు చిన్నారుల ఎత్తుకు తగిన బరువు, పిల్లలపర్యవేక్షణ పై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు, ఈ సందర్భంగా సూపర్వైజర్ నిర్మలా మాట్లాడుతూ గ్రామాల్లోని అంగన్ వాడి ఉపాధ్యాయులు చిన్నారుల పెరుగుదల, పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు, ఈనెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అంగన్వాడి కేంద్రం పరిధిలో పిల్లల బరువులు, ఎత్తులు చూడాలని తెలిపారు, వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి 0 నుండి 5 సంవత్సరం లోపు పిల్లల ఎత్తులు,బరువులు, జబ్బ కొలతలు తీయాలన్నా రు, తీవ్ర లోప పోషణ ఉన్న పిల్లలను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి సలహాలు తీసుకొని అదనపు పోషకాహారాన్ని అందించుటకు కృషి చేయాలన్నారు, అలాగే అంగన్వాడి సేవలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు గుర్రం లత ,శ్రీదేవి,పొషణ అభియాన్ కోఆర్డినేటర్ ,రాజకుమార్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: Special attention should be paid to the welfare of children.