Natyam ad

ఏప్రిల్‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.  ఏప్రిల్ 5, 19, 26వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఏప్రిల్ 4న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం. ఏప్రిల్ 4వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.  ఏప్రిల్ 9న ఆల‌యంలో ఉగాది ఆస్థానం. ఏప్రిల్ 12న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

 

Post Midle

ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీపట్టాభిరామస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు. ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ వ‌ర‌కు ప్రతి రోజు సాయంత్రం బుగ్గోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.  ఏప్రిల్ 21న‌ ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు ద‌ర్వ‌నం ఇవ్వ‌నున్నారు.ఏప్రిల్ 23న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం.

 

Tags; Special celebrations at Sri Govindarajaswamy temple in April

Post Midle